Mahabubnagar: ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు భయ్యా!
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల గంగాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు ఇటీవల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో సబార్డినేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని పట్టుతో ఉన్నాడు. కానీ అనుకొని పరిస్థితులు ఆ యువకుడిని ఉద్యోగం కోల్పోయేలా చేశాయి.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల గంగాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు ఇటీవల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో సబార్డినేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని పట్టుతో ఉన్నాడు. కానీ అనుకొని పరిస్థితులు ఆ యువకుడిని ఉద్యోగం కోల్పోయేలా చేశాయి. ఇంటర్వ్యూకు హాజరుకావాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నాగరాజుకు కాల్ లెటర్ పంపించింది. అయితే ఆ లెటర్ సరైన సమయానికి అందకపోవడంతో కలలు కన్న ప్రభుత్వ ఉద్యోగం రాకుండా పోయింది. సెప్టెంబర్ 27 తేదీలోపు ఇంటర్వ్యూకు రావాల్సిందిగా స్పీడ్ పోస్ట్‌లో కాల్ లెటర్ పంపించారు ట్రాన్స్కో అధికారులు.. కానీ తనకు అక్టోబర్ 4 తేదీన లెటర్ రావడంతో, చేతివరకు వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయాడు.
ఈ వ్యవహారంలో పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల తనకు సమయానికి కాల్ లెటర్ అందలేదని నాగరాజు గుర్తించాడు. తన సహచరులతో కలిసి జడ్చర్ల పోస్టల్ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. బాధితుడు అడిగిన ప్రశ్నలకు, జరిగిన నష్టానికి ఏం సమాధానం చెప్పాలని వారితో గొడువకు దిగాడు. ఏది ఏమైనా పోస్టల్ శాఖ నిర్లక్ష్యం వల్లే తాను ఉద్యోగ అవకాశం కోల్పోయానని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు నాగరాజు డిమాండ్ చేస్తున్నాడు. సమయానికి లెటర్‌ను పంపిస్తే ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగాన్ని పొందేవాడినని బాధితుడు నాగరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.