AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మంత్రి కొండా సురేఖ Vs హీరో నాగార్జున.. వివాదం ఎక్కడివరకు పోతుందో..?

నటుడు అక్కినేని నాగార్జున, తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ సద్దుమణిగిందని అనుకుంటే పీక్స్‌కు చేరింది. నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు భేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పినా ఆది పరువునష్టం కేసుల దాకా పోయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చెసుకోవచ్చు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎవరు సమర్ధించకపోవడం గమనార్హం.

Telangana: మంత్రి కొండా సురేఖ Vs హీరో నాగార్జున.. వివాదం ఎక్కడివరకు పోతుందో..?
Konda Surekha Nagarjuna
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Oct 10, 2024 | 6:45 PM

Share

నటుడు అక్కినేని నాగార్జున, తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ సద్దుమణిగిందని అనుకుంటే పీక్స్‌కు చేరింది. నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు భేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పినా ఆది పరువునష్టం కేసుల దాకా పోయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చెసుకోవచ్చు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎవరు సమర్ధించకపోవడం గమనార్హం.

అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో  ఏకంగా పరువు నష్టం వేసే పరిస్థితికి వచ్చిందంటే ఈ మ్యాటర్ ఎంత పీక్స్ చేరుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని అధికార కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజ్ఞప్తి చేసినప్పటికీ, మరొకవైపు కొండా సురేఖ వ్యాఖ్యలను వెనక తీసుకున్నప్పటికీ నాగార్జున ఈ ఇష్యును సీరియస్‌‌గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. దీని వెనక ఉండి ఎవరైనా నడిపిస్తున్నారా అనే సందేహం వ్యక్తమవుతుంది. ఎందుకంటే అక్కినేని నాగార్జున మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించినప్పటికీ ఇప్పుడు కోర్టులో పరువునష్టం దావా వేసే స్థాయికి చేరడానికి గల కారణాలు లేకపోలేదు.  ఇటీవల ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసింది. ఈ విషయంలో అక్కినేని నాగార్జున గరంగా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు నాగార్జునకు ఇదొక అవకాశంగా దొరికినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

కొండా సురేఖ వ్యవహారంలో హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా కూడా ఇంతలా రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటీ అని, దీన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని చెప్పారు. అదేవిధంగా ఒక బీసీ మహిళా మంత్రికి తమంతా అండగా ఉంటామని, పరోక్షంగా అక్కినేని నాగార్జునకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పటికే నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య, మరో ఇద్దరు సాక్షులు నాంపల్లి కోర్టుకు హాజరై తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. అయితే కోర్టు కూడా వాళ్ళ స్టేట్‌మెంట్‌‌ను రికార్డ్ చేసింది. మరి కోర్టు ఏ విధంగా ఈ కేసును పరిశీలించి తీర్పు ఇస్తుందో అనేది మాత్రం మున్ముందు చూడాలి..