Andhra Pradesh: మంచిరోజులు వచ్చేశాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత బలోపేతం..! కేంద్ర బృందంతో సీఎం సమీక్ష
విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతి కోసం అవసరమైన సాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు సీఎం చంద్రబాబు .విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పూర్వ వైభవం వచ్చేలా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. అవసరమైన సహకారాన్ని అందిస్తామని భరోసా ఇవ్వడం సహా విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం కోసం కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి..

విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం దిశగా కూటమి సర్కార్ ప్రణాళికలకు పదను పడుతోంది. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఆశాఖ ఉన్నతాధికారుల బృందంతో కలిసి అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. కేంద్ర బృందాన్ని సాదరంగా స్వాగతించిన సీఎం చంద్రబాబు, విశాఖ ప్లాంట్ పురోగతిపై కీలక చర్చలు జరిపారు. ఏపీతో భావోద్వేగం అనుబంధం వున్న విశాఖ స్టీల్‌ను పరిరక్షించుకోవాల్సిన అవసరం వుందన్నారు సీఎం చంద్రబాబు. రివైవల్ ఫండ్ సద్వినియోగం సహా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యచరణపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు..
విశాఖ స్టీల్‌ప్లాంట్ సెక్యూరిటీ అంశం కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. . CISF భద్రత స్థానంలో రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం – SPF తో ప్లాంట్‌కు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్లాంట్ నిర్వహణ వ్యయం తగ్గించాలని సూచించారు సీఎం చంద్రబాబు .నిర్వహణ వ్యయం తగ్గించుకోవడంతో పాటు . సామర్థ్యం పెంచితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. స్టీల్ ప్లాంట్ పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడం, ప్రస్తుతం పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేసులతో పాటు, 3వ ఫర్నేస్‌ను కూడా తిరిగి ప్రారంభించడం పై సమావేశంలో చర్చించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతి కోసం అవసరమైన సాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు సీఎం చంద్రబాబు .విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పూర్వ వైభవం వచ్చేలా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. అవసరమైన సహకారాన్ని అందిస్తామని భరోసా ఇవ్వడం సహా విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం కోసం కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్కు శాఖ ఉన్నాతాధికారుల బృందం. సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి శ్రీనివాస్ వర్మ, కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




