Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రేమ కోసం పిడకల యుద్ధం..! ఎన్నో ఏళ్ల వింత ఆచారం.. ఎక్కడంటే..

ఇక ఈ పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు స్వామి వారి విబూదిని అంటించుకుని వెళ్లారు. సమరం ముగిసిన తరువాత గ్రామపెద్దలు పంచాయితీ చేసి.. కాళికాదేవి, వీరభద్రస్వామి వివాహానికి ఈ రోజు తెల్లారుజామున అంగీకారం తెలిపారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు కైరుప్పల చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు.. ఎలాంటి ఆవాంఛని సంఘటనలు జరకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Andhra Pradesh: ప్రేమ కోసం పిడకల యుద్ధం..! ఎన్నో ఏళ్ల వింత ఆచారం.. ఎక్కడంటే..
Pidakala Samaram
Follow us
J Y Nagi Reddy

| Edited By: Jyothi Gadda

Updated on: Apr 01, 2025 | 7:33 AM

దేవరగట్టులో దసరాకి కర్రల సంబరం జరిగినట్టుగానే, ఉగాదికి కైరుప్పలలో పిడకల సమరం అంతే స్థాయిలో ఆకట్టుకుంది. ఇదంతా చూసేందుకు వేలాదిమంది తరలివచ్చారు. ఇద్దరు దేవత మూర్తుల మధ్య ప్రేమను గెలిపించి పెళ్ళి చేసేందుకు శ్రీ కాళిక మాత, శ్రీ వీరభద్రస్వామి భక్తులు పిడకల సమరం సాగించారు.. భక్తి శ్రద్ధలతో సంప్రదాయ ప్రకారం ఈ ఆచారాన్ని కొనసాగించారు..ఈ పిడకల సమరం ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో జరిగింది.

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పాల గ్రామంలో శ్రీ భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది మరుసటి రోజు ఇక్కడ జరిగే పిడకల సమరం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం.. ఈ ఏడాది వేలాది మంది సమక్షంలో హోరాహోరీగా పిడకల సమరం సాగింది… ఈ సమరం లో దాదాపు 40 మంది స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డ వారు స్వామి వార్ల ఆలయానికి వెళ్ళి విభూతి రాసుకొని వెళ్ళిపోయారు.

పిడకల సమరం లో హైలైట్ ఏంటంటే.. సంప్రదాయం ప్రకారం కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్తుడైన నందకీషోర్ రెడ్డి గుర్రంపై మందీ మార్బలం, తప్పెట్లు, మేళతాళాలతో కైరుప్పలకు వచ్చారు. దేవాలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరిగారు.పిడకల సమరం మొదలైంది. వీరభద్రస్వామి, కాళికాదేవి వర్గీయులు వేరు వేరుగా విడిపోయారు. పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

వందల సంఖ్యలో పిడకలు గాల్లోకి లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే ఉత్సాహం రెట్టింపైంది. పిడకల దుమ్ము అకాశాన్నంటింది. తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకుంటూ గుంపులు, గుంపులుగా ప్రజలు కదిలారు. ఒక సారి ఒక వర్గం వారిది పైచేయి అయితే, మరో సారి మరో వర్గం వారిది పైచేయిగా నిలిచింది. తమ వర్గం వారు గెలవాలనే తపనతో మహిళలు పిడకలు అందిస్తూ సాయంగా నిలిచారు. కుప్పగా వేసిన పిడకలు అయిపోయేంత వరకు అరగంట పాటు పోరు కొనసాగింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇక ఈ పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు స్వామి వారి విబూదిని అంటించుకుని వెళ్లారు. సమరం ముగిసిన తరువాత గ్రామపెద్దలు పంచాయితీ చేసి.. కాళికాదేవి, వీరభద్రస్వామి వివాహానికి ఈ రోజు తెల్లారుజామున అంగీకారం తెలిపారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు కైరుప్పల చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు.. ఎలాంటి ఆవాంఛని సంఘటనలు జరకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.