AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాప్‌రే.. కివీ తొక్కలో ఇంత మ్యాటర్‌ ఉందా..? పడేస్తే మిస్ అవుతారు సుమా..!

నారింజ, బత్తాయి వంటి పండ్లలో కన్నా కివీ పండులో విటమిన్ సి రెట్టింపు మోతాదులో లభిస్తుంది. యాపిల్ కంటే 5 రెట్లు ఎక్కువ పోషకాలను ఇది కలిగి ఉంటుంది. పీచు పదార్థం, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ల వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి. పోషకాల నిధి, వండర్ ఫ్రూట్ గా పిలిచే కివీ తొక్కలు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆయా లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

బాప్‌రే.. కివీ తొక్కలో ఇంత మ్యాటర్‌ ఉందా..? పడేస్తే మిస్ అవుతారు సుమా..!
Kiwi Peels
Jyothi Gadda
|

Updated on: Mar 31, 2025 | 12:39 PM

Share

గత కొంతకాలంగా మార్కెట్లో అనేక రకాలైన విదేశీఫ్రూట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అలాంటి వాటిలో కివీ కూడా ఒకటి. చైనీస్ గూస్బెర్రీస్ అని కూడా పిలుస్తారు. కివీలో విటమిన్లు A, E, C, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో మంచి మొత్తంలో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఒక కప్పు కివీ ముక్కలలో.. మనకు రోజుమొత్తం సరిపడా విటమిన్‌ సీ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇది శరీరంలో కణజాలాల పెరుగుదలకు, మరమ్మత్తుకు చాలా అవసరం. కివీలో ఫైబర్‌ మెండుగా ఉంటుంది. ఇది పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఈ అద్భుతమైన పండును మీ ఆహారంలో చేర్చుకుంటే.. చాలా ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు సైతం చెబుతున్నారు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కివీ పండు మాత్రమే కాదు.. తొక్కలు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆయా లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కివీ పండు తొక్కలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కివి తొక్కలో ఇతర పండ్ల కంటే మూడు రెట్లు ఎక్కువ ఫైబర్ ఉందని పరిశోధనలో తేలింది. ఫైబర్ అంటే అది జీవక్రియను పెంచుతుంది. మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇవి జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా పనిచేస్తుంది.

కివి తొక్కలో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కొవ్వును కరిగించడానికి పనిచేస్తుంది. దీనివల్ల కడుపు ఎక్కువసేపు నిండినట్లు అనిపిస్తుంది, ఇది అనవసరంగా తినకుండా ఉండటానికి సహాయపడుతుంది. కివి తొక్క శరీరంలో ఇన్సులిన్‌ను కూడా సమతుల్యం చేస్తుంది. దీనివల్ల అతిగా తినాలనే కోరిక శాంతిస్తుంది. దీన్ని తినడం వల్ల మీ బరువు త్వరగా తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, వాపు కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

అయితే, కివి తొక్కను వాడేందుకు ముందుగా బాగా కడగాలి. తర్వాత దాన్ని జ్యూస్‌లా చేసుకుని తినొచ్చు.. మీకు కావాలంటే మీరు నమలవచ్చు. కానీ దాని ఆకృతి కొంచెం ముళ్ళుగా ఉండటం వల్ల మీకు అది నచ్చకపోవచ్చు. అందువల్ల షేక్ లేదా స్మూతీలో కలిపి కూడా తాగవచ్చు. ఇది కాకుండా, తొక్కను ఎండబెట్టి మెత్తగా చేసుకుని పొడి రూపంలో కూడా ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..