- Telugu News Photo Gallery Amazing Health Benefits of Drinking Soaked Cumin Seeds Water Daily Morning
Jeera Water: నానబెట్టిన జీలకర్ర నీటితో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. లాభాలు తెలిస్తే..
జీలకర్ర.. ప్రతిఒక్కరి వంటగదిలో తప్పక ఉపయోగించే ఒక సాధారణ మసాలా. ఇది ఆహారానికి మంచి రుచిని అందిస్తుంది. అంతేకాదు..ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర నీరు వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉందని పరిశోధకులు సైతం వివరించారు. అయితే, రాత్రంతా నీళ్లల్లో నానబెట్టిన జీలకర్రను ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజానలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ జీలకర్ర నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 31, 2025 | 8:26 AM

జీలకర్రలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా, జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ముఖ్యమైనది.

దీనితో పాటు, జీలకర్ర నీరు శరీర జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది, ఇది బరువు తగ్గించే ప్రయాణంలో సహాయపడుతుంది. జీలకర్రను నీటిలో మరిగించి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే, అది మీ శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది.

జీలకర్ర నీటిని తాగడం వల్ల ఊబకాయం సమస్య తగ్గుతుంది. జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగిస్తాయి. జీలకర్ర నీటిని తాగడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇందులోని ఫాలీఫినాల్స్ ఆందోళనను తగ్గిస్తాయి.

నానబెట్టిన జీలకర్ర నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. జీలకర్ర నీటిలో యాంటీ బయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా మార్చుతాయి. జీలకర్ర నీటిని తాగితే చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. జీలకర్ర నీటిని తాగడం వల్ల ఒత్తైన కురులను పొందవచ్చు. జీలకర్ర నీటిని తాగితే జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది.

ఒక గ్లాసు జీలకర్ర నీటిని రెగ్యులర్‌గా తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది. జీలకర్ర నీటిని తాగితే గుండెలో మంట సమస్య కూడా తగ్గుతుంది. జీలకర్ర నీటిని తాగడం వల్ల పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది. ఒక గ్లాసు జీలకర్ర నీటిని తాగితే పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిరి అదుపులో ఉంటుంది. జీలకర్ర నీటిని తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీలకర్ర నీరు రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. దీంతో గుండె సమస్యలు రావు.




