- Telugu News Photo Gallery Bitter gourd health benefits weight loss diabetes control and more health advantages
ఈ కాయ తింటే బరువు తగ్గడం ఖాయం.. మధుమేహం మాయం.. కంటిచూపు రెట్టింపు..!
కూరగాయలన్నింటిలో కాకరకాయ ప్రత్యేకం.. ఈ కూరగాయను చూడగానే చాలా మంది ముఖం తిప్పేసుకుంటారు.. కానీ, కాకరకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే చిన్న ముక్కకూడా వదిలిపెట్టకుండా తినేస్తారని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వివిధ పోషకాలతో సమృద్ధిగా ఉండే కాకరకాయ ఒక ఔషధం కంటే తక్కువేమి కాదని అంటున్నారు.. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాకరకాయలో ఉండే మోమోర్డిసిన్, పాలీపెప్టైడ్-పి అనే క్రియాశీల మూలకాలు డయాబెటిక్ రోగులకు వరంలా పనిచేస్తుంది. కాకరకాయ మరిన్ని ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Mar 31, 2025 | 9:20 AM

కాకరకాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, బీటా కెరోటీన్, ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే తరచూ కాకరకాయ తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అజీర్తి కూడా దరి చేరదు. కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులి పురుగులు, ఇతర క్రిములను నాశనం చేస్తుంది.

కాకరకాయలో ఉండే పాలీపెప్టెడ్స్ అనేవి షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతాయి. క్రమం తప్పకుండా కాకరకాయ తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. కాకర కాయ జ్యూస్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి సమస్యలు రావట. కాకరకాయలో తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారికి కాకరకాయ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడంలో కూడా కాకరకాయ సహాయపడుతుంది. కాకరకాయ తినడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాకరకాయ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచి ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

కాకరకాయలో ఉండే మెగ్నీషియం, పొటాషియం గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తపోటుని కంట్రోల్ చేస్తాయి. కాకరకాయ తింటే గుండె సమస్యలు, స్ట్రోక్ వంటివి రావు. కాకరకాయలో ఉండే చేదు జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. కాకరకాయలు తినడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.

కాకరకాయ క్యాన్సర్ రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు పెరగకుండా, క్యాన్సర్ బారిన పడకుండా చూస్తాయి. కాకరకాయలను తినడం వల్ల శ్వాస సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఆస్తమా, జలుబు వంటి సమస్యలు కూడా రావు. హెల్తీగా ఉండవచ్చు.





























