Summer Drinks: వేసవిలో మీ చర్మం మెరిసిపోవాలంటే ఓ చల్లని డ్రింక్స్ ట్రై చేయండి.. ఆరోగ్యంతోపాటు అందం మీ సొంతం
మండే ఎండల్లో చల్లని పానియాలు తాగుతూ సేద తీరుతుంటారు జనాలు. కానీ కూల్ డ్రింక్స్ వంటివి తాగితే ఇవి అప్పటికి దాహం తీర్చిన ఆ తర్వాత లేనిపోని ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ కింది సహజ పానియాలు తాగేందుకు ట్రై చేయండి. ఇవి ఆరోగ్యమే కాదు ఎండకు వాడిన చర్మానికి చికిత్స కూడా అందిస్తాయి..

వేసవి మొదలైంది. ఉదయం పది గంటలకే మండే ఎండలు అల్లాడిస్తున్నాయి. అందువల్ల మండే ఎండల నుంచి ఉపశమనానికి అధిక మంది శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతుంటారు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి వారు అనేక రకాల కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. రసాయనాలతో నిండిన ఈ డ్రింక్స్ తాగితే దాహం సంగతి పక్కన బెడితే ఆరోగ్యం విపరీతంగా పాడైపోతుంది. కానీ ఈ కింది పానీయాలు శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, సూర్యుని వేడికి వాడిన చర్మానికి చికిత్స అందించి, ప్రకాశవంతంగా చేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
నారింజ – అల్లం రసం
నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షిస్తుంది. ఇందులోని అల్లం శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
పుచ్చకాయ – పుదీనా రసం
వేసవిలో ప్రతిచోటా లభించే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది హైడ్రేటింగ్ మాత్రమే కాకుండా విటమిన్లు ఎ, సి, లైకోపీన్ లతో కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ రసం చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులోని పుదీనా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇవి చర్మం మంట, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.
పైనాపిల్ – అల్లం రసం
పైనాపిల్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇందులో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ చర్మ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. అల్లంలో ఉండే పోషకాలు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.
నిమ్మ – పుదీనా రసం
సిట్రస్ పండు అయిన నిమ్మకాయలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. నిమ్మ – పుదీనా రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మంలో వివిధ మార్పులు వస్తాయి. నిమ్మకాయకు ముఖం కాంతిని పెంచే గుణం కూడా ఉంటుంది. పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.