AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Shami IPL Auction 2025: మహమ్మద్ షమీ రూ.10 కోట్లకు దక్కించుకున్న సన్‌రైజర్స్‌కు..

Mohammed Shami IPL 2025 Auction Price: సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఐపీఎల్ 2025 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ.10 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున అద్భుతంగా రాణించిన షమీ, బౌలింగ్ విభాగంలో అనుభవంతో పాటు వికెట్ల తీసే సామర్థ్యాన్ని జోడించి, జట్టుకు కీలకంగా మారనున్నాడు. 120+ ఐపీఎల్ మ్యాచ్‌ల అనుభవం కలిగిన షమీ, పవర్ ప్లే, డెత్ ఓవర్లలో సత్తా చాటాడు.

Mohammed Shami IPL Auction 2025: మహమ్మద్ షమీ రూ.10 కోట్లకు దక్కించుకున్న సన్‌రైజర్స్‌కు..
Mohammed Shami
TV9 Telugu
| Edited By: Narsimha|

Updated on: Nov 24, 2024 | 5:02 PM

Share

ఐపీఎల్ వేలంలో టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ దక్కించుకుంది. వేలంలో పది కోట్లకు షమీని SRH దక్కించుకుంది. ఈ కొనుగోలు ద్వారా సన్‌రైజర్స్ తన బౌలింగ్ దళాన్ని మరింత పటిష్టం చేసుకోగా, షమీ తన అనుభవంతో జట్టుకు కీలకమైన బలం చేకూర్చనున్నాడు. సౌదీ అరేబియాలో జరిగిన ఈ వేలంలో సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య షమిని సంపాదించేందుకు తీవ్రమైన పోటీ జరిగింది.

షమీ బేస్ ప్రైస్ రూ.2 కోట్లు కాగా, సన్‌రైజర్స్ అతన్ని పొందేందుకు మిగతా జట్లను అధిగమించి విజయం సాధించింది. షమిని జట్టులోకి తీసుకోవడం ద్వారా సన్‌రైజర్స్ తమ పేస్ బౌలింగ్ విభాగంలో అనుభవాన్ని జోడించింది. ఫ్రాంచైజీ యాజమాన్యం అతని కొనుగోలుపై సంతోషం వ్యక్తం చేస్తూ, అతని నాయకత్వ నైపుణ్యాలు మరియు కీలక సమయంలో వికెట్లు తీయగల సామర్థ్యం జట్టుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొంది.

స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ ఓటమి తర్వాత మహ్మద్‌ సమీ తీవ్ర నిరాశకు గురయ్యాడు. అలాగే, ప్రపంచకప్‌ నుంచి గాయం కారణంగా దూరంగా ఉన్నాడు. నిరాశతో ఒక సంవత్సరం గడిచింది. ఈ సీజన్‌లో అతడిని గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేయలేదు. దేశానికే కాకుండా ప్రపంచ అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా నిలిచిన షమీ.. మూడు ఫార్మాట్లలో విజయం సాధించాడు. ప్రపంచకప్ వేదికపై ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాడు. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత గాయం కారణంగా అతను దూరమయ్యాడు. దీంతో అతను ఐపీఎల్‌లో ఆడలేకపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి అతని ప్రవేశం చాలా కాలం క్రితం జరిగింది. దేశవాళీ క్రికెట్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన కారణంగా 2011లో కోల్‌కతా నైట్ రైడర్స్ అతనిని ఎంపిక చేసింది. అయితే 2013 ఐపీఎల్‌లో అతనికి మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

వచ్చే ఏడాది కొత్త జట్టులో షమీని చూసే ఛాన్స్ ఉంది. షమీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) చేజిక్కించుకుంది. సమీ 2014-2018 మధ్య ఢిల్లీ జట్టులో ఉన్నాడు. ఆ కోణంలో ఢిల్లీ జెర్సీలో అతనికి అవకాశం రాలేదు. ఐపీఎల్ 2019లో పంజాబ్ కింగ్స్ అతన్ని తీసుకుంది. 2019లో 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు, 2020 ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు, 2021 ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు.