AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul: ఐపీఎల్ మెగా వేలంలో కేఎల్ రాహుల్‌కు షాక్.. ఎంత ధరంటే?

KL Rahul IPL 2025 Auction Price: ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేఎల్ రాహుల్‌ను రూ.14 కోట్లకు ఢిల్లీని కొనుగోలు చేసింది. గతంలో రాహుల్ లక్నో కెప్టెన్‌గా వ్యవహరించాడు.

KL Rahul: ఐపీఎల్ మెగా వేలంలో కేఎల్ రాహుల్‌కు షాక్.. ఎంత ధరంటే?
Kl Rahul
Venkata Chari
| Edited By: TV9 Telugu|

Updated on: Nov 25, 2024 | 12:07 PM

Share

ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేఎల్ రాహుల్‌ను రూ.14 కోట్లకు ఢిల్లీని కొనుగోలు చేసింది. గతంలో రాహుల్ లక్నో కెప్టెన్‌గా వ్యవహరించారు. మహేంద్ర సింగ్ ధోనీలా కాకపోవచ్చు.. కానీ ఖచ్చితంగా కూల్ కెప్టెన్ అనే పేరు తెచ్చుకున్న కేఎల్ రాహుల్.. మెగా వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడిని తీసుకోవడానికి చాలా టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయి. దేశంలోని అత్యుత్తమ బ్యాటర్లు, కీపర్లు, కెప్టెన్లలో ఒకడిగా మెగా వేలానికి సిద్ధమయ్యాడు. లోకేశ్ రాహుల్ బేస్ ధర 2 కోట్లుగా నిర్ధారించుకున్నాడు.

కెప్టెన్-కీపర్-బ్యాటర్‌గా వేలానికి సిద్ధమైన హై ప్రొఫైల్ క్రికెటర్ లోకేష్ రాహుల్.. కూల్ హెడ్, గొప్ప కీపర్‌తో పాటు బ్యాటింగ్‌లో విధ్వంసకర ఫామ్‌తో నడిపించగలడు. లోకేష్ రాహుల్ ని ‘ఫుల్ ప్యాకేజీ’ అనొచ్చు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. కానీ గత సీజన్ చాలా అసౌకర్యంగా ఉంది. దీంతో లక్నో సూపర్ జెయింట్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది.

కేఎల్ రాహుల్ 132 మ్యాచ్‌లు, 123 ఇన్నింగ్స్‌ల్లో 4683 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 132 నాటౌట్. బ్యాటింగ్ సగటు 46గా ఉంది. ఐపీఎల్‌లో 37 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ కెరీర్‌లో నాలుగు జట్లకు ఆడాడు. ఇదంతా అతని సొంత జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ప్రారంభమైంది. ఆ సంవత్సరంలో 2013. సన్‌రైజర్స్ హైదరాబాద్ తర్వాతి రెండు సీజన్లు ఆడాడు. 2018లో రాహుల్‌ను పంజాబ్ కింగ్స్ తీసుకుంది. ఈ జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. 2022లో మరో రెండు జట్లు IPL అరంగేట్రం చేశాయి. అందులో ఒకటి లక్నో సూపర్ జెయింట్స్. తొలి ఆటగాడిగా లోకేశ్ రాహుల్‌ను జట్టు సంతకం చేసుకుంది. లోకేష్ రాహుల్ కెప్టెన్సీ, నిష్కళంకమైన బ్యాటింగ్ కారణంగా లక్నో రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి