Mohammed Siraj IPL Auction 2025: గుజరాత్ గూటికి హైదరాబాద్ సిరాజ్ మియా.. ఎన్ని కోట్లంటే?

Mohammed Siraj IPL 2025 Auction Price: ప్రస్తుతం టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్. దీంతో ఐపీఎల్ మెగా వేలంలో అతనిని దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. చివరకు గుజరాత్ సిరాజ్ మియాను సొంతం చేసుకుంది.

Mohammed Siraj IPL Auction 2025: గుజరాత్ గూటికి హైదరాబాద్ సిరాజ్ మియా.. ఎన్ని కోట్లంటే?
Mohammed Siraj
Follow us
Basha Shek

|

Updated on: Nov 24, 2024 | 5:35 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన పేసర్లలో మహమ్మద్ సిరాజ్ ఒకడిగా పేరుగాంచాడు. ఇప్పుడు అతను దేశం తరపున మూడు ఫార్మాట్లలో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో గత సీజన్ లో ఆర్సీబీ తరఫున సత్తా చాటిన మహ్మద్ సిరాజ్ ఈ సారి మెగా వేలంలోకి వచ్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో అదరగొడుతోన్న ఈ హైదరాబాదీ ప్లేయర్ పై ఐపీఎల్ మెగా వేలంలో కాసుల వర్షం కురిసింది. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ రూ. 12.25 కోట్లత సిరాజ్ ను సొంతం చేసుకుంది. గుజరాత్ జట్టులో ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్లు లేరు. కాబట్టి ఆ టీమ్ బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ ముందుండి నడిపించనున్నాడు. కాగా సిరాజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హోమ్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. సిరాజ్ హైదరాబాద్‌కు చెందిన క్రికెటర్. సన్‌రైజర్స్ తరపున ఒకే ఒక్క సీజన్ ఆడాడు. అయితే సిరాజ్ విషయంలో నిలకడ లోపమే ప్రధానంగా కనిపిస్తోంది. కొన్ని మ్యాచ్‌లలో రాణిస్తే.., కొన్నిసార్లు విఫలమవుతుంటాడు. ప్రస్తుతం మెల్లగా ఈ సమస్య నుంచి బయటపడుతున్నాడు.

ఐపీఎల్‌లో సిరాజ్ కెరీర్ కూడా సుదీర్ఘమైనది. 93 మ్యాచ్‌ల్లో 93 వికెట్లు తీశాడు. పవర్ ప్లే-స్లాగ్ ఓవర్ కూడా సమర్థంగా బౌలింగ్ చేయగలడు. అయితే ఎకానమీ రేటు చాలా ఎక్కువగా ఉంది. ఐపీఎల్‌లో అతని ఎకానమీ 8.64గా ఉంది. అయితే అంతర్జాతీయ టీ20లో అతని ఎకానమీ 7.79 మాత్రమే. ఇక ఆర్సీబీ జట్టులో చాలా ఏళ్ల పాటు రెగ్యులర్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు సిరాజ్. అయితే బెంగళూరు టీమ్ ఈసారి మాత్రం సిరాజ్ ను రిటైన్ చేసుకోలేదు. దీంతో అతను మెగా వేలంలోకి వచ్చాడు.

ఇవి కూడా చదవండి

రూ. 12. 25 కోట్లతో గుజరాత్ గూటికి మహ్మద్ సిరాజ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..