AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ డేటా సెంటర్..ఆ సంస్థ సీఈవోతో మంత్రి నారా లోకేష్ చర్చలు

దిగ్గజ కంపెనీలతో మీటింగ్‌.. బడా పారిశ్రామికవేత్తలతో బైఠక్‌.. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటించారు మంత్రి నారా లోకేశ్‌. టాప్ గ్లోబల్ కంపెనీల ప్రతినిధులను కలిసి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ డేటా సెంటర్..ఆ సంస్థ సీఈవోతో మంత్రి నారా లోకేష్ చర్చలు
Minister Lokesh Usa Tour
TV9 Telugu
| Edited By: Jyothi Gadda|

Updated on: Oct 31, 2024 | 12:32 PM

Share

ఏపీ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన ముగిసింది. చివరి రోజు లాస్‌వెగాస్‌లో ఐటీ సర్వ్‌ సినర్జీ సమ్మిట్‌లో విశిష్ట అతిథిగా కీలక ఉపన్యాసం చేశారు లోకేశ్‌. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఎండీ రేచల్‌, పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి, రెవేచర్‌ సీఈవో అశ్విన్‌భరత్‌, సేల్స్‌ ఫోర్స్‌ ఏఐ సీఈవో క్లారా షియాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతలను వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్‌ను కోరారు లోకేశ్‌. ఆంధ్రప్రదేశ్‌లో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పడానికి సహకరించాలని రెవేచర్ సీఈవోకు విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు మైక్రోసాఫ్ట్, అడోబ్, ఆపిల్‌ సంస్థల ప్రతినిధులను కలిశారు మంత్రి లోకేశ్. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశమై.. ఏపీ ప్రభుత్వ విధానాలను వివరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్ సహకారం అందించాలన్నారు. అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా రూపొందించబోతున్నామని .. ఏఐ యూనివర్సిటీలో పెట్టుబడులు పెట్టాలని సత్యనాదెళ్లను కోరారు లోకేష్. డిజిటల్ గవర్నెన్స్ విధానాల్లో కూడా మైక్రోసాఫ్ట్ సహకరించాలన్నారు. ఏపీలో డిజిటల్ ట్రాన్ఫార్మేషన్, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల మాట ఇచ్చారన్నారు మంత్రి లోకేశ్‌.

శాన్‌ఫ్రాన్సిస్కోలో అడోబ్ CEO శంతను నారాయణ్‌తో భేటీ అయిన లోకేష్.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. యాపిల్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి, ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రహ్మణ్యంని కలిశారు లోకేష్. యాపిల్ కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న టెస్లా కార్యాలయాన్ని సందర్శించిన లోకేశ్…ఆ కంపెనీ CFO వైభవ్‌తో భేటీ అయ్యారు. డాల‌స్‌లో పెరోట్ గ్రూప్ చైర్మన్‌ను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. నారా లోకేశ్ అమెరికా పర్యటన ఆద్యంతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా కొనసాగిందన్నారు టీడీపీ నేతలు. త్వరలో రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు క్యూ కడుతాయన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి