శ్రీశైలం భక్తులకు షాకింగ్ న్యూస్.. బస్టాండ్ సమీపంలో మాటువేసిన చిరుతపులి..! ఇదిగో వీడియో..
అంతకు ముందు శ్రీశైలం, హైదరాబాద్ హైవే వట్టరపల్లి వద్ద కూడా రోడ్డుపై పులి సంచారం చేస్తూ కనిపించింది. హైవేపై వెళ్తున్న ప్రయాణికులు ఈ దృశ్యాలను వీడియో తీశారు. వారం రోజుల కిందట అచ్చంపేట ప్రాంతంలో కూడా పెద్దపులి సంచారం చేస్తూ కనిపించింది.
Srisailam: శ్రీశైలం రోడ్లపై మరోసారి చిరుత హల్‌చల్ చేసింది.. శ్రీశైలం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చిరుతపులి కనిపించటం కలకలం రేపుతోంది. బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రయాణికులు, స్థానికులు ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఒక్కసారిగా చిరుతపులిని చూసి భయాందోళనకు గురైన భక్తులు,స్థానికులు. బస్టాండ్ సమీపంలో ఓ గోడపై కూర్చున్న చిరుతపులిని వీడియోను రికార్డ్ చేశారు. వీడియో అధికారులకు కూడా చేరటంతో స్థానిక ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవిశాఖ,దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..
అంతకు ముందు శ్రీశైలం, హైదరాబాద్ హైవే వట్టరపల్లి వద్ద కూడా రోడ్డుపై పులి సంచారం చేస్తూ కనిపించింది. హైవేపై వెళ్తున్న ప్రయాణికులు ఈ దృశ్యాలను వీడియో తీశారు. వారం రోజుల కిందట అచ్చంపేట ప్రాంతంలో కూడా పెద్దపులి సంచారం చేస్తూ కనిపించింది. అమ్రాబాద్‌లోని తిరుమలాపూర్ సమీపంలో రోడ్డుపై తిరుగుతూ స్థానికుల కంట పడింది. కాసేపు రోడ్డుపై తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..