AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తనకు అతీత శక్తులున్నాయంటూ.. హాస్టల్‌ బిల్డింగ్‌ పై నుంచి దూకేసిన బీటెక్‌ విద్యార్థి..షాకింగ్‌ వీడియో వైరల్

బీటెక్ చదువుతున్న 19 ఏళ్ల ప్రభుకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మకం. తనకు శక్తులు ఉన్నాయంటూ ఎన్నోసార్లు తన తోటి విద్యార్థులకు చెబుతుండేవాడు. సోమవారం నాడు కాలేజీ హాస్టల్ 4వ అంతస్తు వరండాలో ఇద్దరు విద్యార్థులు నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా, అటుగా వచ్చిన ప్రభు.. వారు చూస్తుండగానే హఠాత్తుగా పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేశాడు.

తనకు అతీత శక్తులున్నాయంటూ.. హాస్టల్‌ బిల్డింగ్‌ పై నుంచి దూకేసిన బీటెక్‌ విద్యార్థి..షాకింగ్‌ వీడియో వైరల్
B.tech Student Jumps Off Ho
Jyothi Gadda
|

Updated on: Oct 29, 2024 | 9:05 PM

Share

తనకు అతీతశక్తులు ఉన్నాయని చెప్పుకుంటూ ఓ కాలేజీ విద్యార్థి.. హాస్టల్‌లోని నాలుగో అంతస్తు నుంచి అమాంతంగా కిందకు దూకేశాడు..ఈ ఘటనలో బీటెక్ చదువుతున్న ఆ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన తోటి విద్యార్థులు, హాస్టల్‌ సిబ్బంది హుటాహుటినా అతన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో 19ఏళ్ల ఆ విద్యార్థికి కాళ్లు, తుంటి, ముఖంపై గాయాలైనట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ షాకింగ్‌ తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది.

తమిళనాడు కోయంబత్తూరులోని కర్పగం ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న 19 ఏళ్ల ప్రభుకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మకం. తనకు శక్తులు ఉన్నాయంటూ ఎన్నోసార్లు తన తోటి విద్యార్థులకు చెబుతుండేవాడు. సోమవారం నాడు కాలేజీ హాస్టల్ 4వ అంతస్తు వరండాలో ఇద్దరు విద్యార్థులు నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా, అటుగా వచ్చిన ప్రభు.. వారు చూస్తుండగానే హఠాత్తుగా పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేశాడు. దీంతో అతని కాళ్లు, చేతులు విరిగాయి. తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

కాగా, హాస్టల్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోయంబత్తూరు సమీపంలోని మైలేరిపాళయంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్‌లో బీటెక్ చదువుతున్నాడు బాధిత విద్యార్థి ప్రభు. కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ?
శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ?
టీ vs కాఫీ.. ఇదో పెద్ద మైండ్ గేమ్.. మీ ఛాయిస్‌ను బట్టి మీరు ఎలాంట
టీ vs కాఫీ.. ఇదో పెద్ద మైండ్ గేమ్.. మీ ఛాయిస్‌ను బట్టి మీరు ఎలాంట
అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు..అడ పులులదే రాజ్యం
అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు..అడ పులులదే రాజ్యం
నువ్వు లేకపోతే చచ్చిపోతా అని.. తర్వాత టార్చర్ చేశాడు..
నువ్వు లేకపోతే చచ్చిపోతా అని.. తర్వాత టార్చర్ చేశాడు..
బలవంతులమని విర్రవీగితే మనకంటే సమర్థులు ఎదురుపడతారు.. తెలివిగా ఇలా
బలవంతులమని విర్రవీగితే మనకంటే సమర్థులు ఎదురుపడతారు.. తెలివిగా ఇలా
టికెట్ ఉన్నా ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకంటే?
టికెట్ ఉన్నా ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకంటే?
జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే
జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే
మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ
అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ
తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..
తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..