ఆలయాలే టార్గెట్.. పంచలోహ విగ్రహాల చోరీ.. కట్ చేస్తే, సినిమా చూపించిన పోలీసులు..
వారి నుండి సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల పంచలోహ విగ్రహాలతో పాటూ దేవత మూర్తులకు అలంకరించే వెండి, బంగారు ఆభరణాలు, 85 వేల రూపాయల నగదు, రెండు పల్సర్ బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దేవుడికి రక్షణ లేకుండా పోయింది. దేవుడంటే భయం లేకపోగా దేవుడి విగ్రహాలను నగదు, నగలను దొంగలు టార్గెట్ చేశారు. దోచుకెళ్లారు. చివరకు ఆ దేవుడే వారిని శిక్షించారు..ఫలితంగా కటకటాల పాలయ్యారు. ఆలయాల్లో పంచలోహ విగ్రహాలను చోరీ చేసే దుండగులు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. రూ. 5 లక్షలు విలువైన రెండు పంచలోహ విగ్రహాలు, వెండి, బంగారు ఆభరణాలు 85 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కమల్, మంజుల అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరొక నిందితుడి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నంద్యాల జిల్లాలోని వివిధ దేవాలయాల్లో పంచలోహ విగ్రహాలను అపహరించే ముఠాకు నంద్యాల పోలీసులు చెక్ పెట్టారు. ఇద్దరూ దొంగలను అవుకు పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలకు చెందిన కమల్, మంజుల అనే ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల పంచలోహ విగ్రహాలతో పాటూ దేవత మూర్తులకు అలంకరించే వెండి, బంగారు ఆభరణాలు, 85 వేల రూపాయల నగదు, రెండు పల్సర్ బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే, వీరిలో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. అతడు పరారీలో ఉన్నట్టుగా చెప్పారు. చోరీలకు అలవాటు పడ్డ ఈ ముఠా దేవాలయాల్లో విలువైన పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లటమే పనిగా పెట్టుకున్నారు. కాగా, ఎట్టకేలకు వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద లభించిన విగ్రహాలు, బంగారు, వెండి విగ్రహాల విలువ సుమారు 5,00,000/- రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ చోరీల ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..