Viral Video: సోఫాలో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. దిండులో ఏదో కదులుతున్నట్టుగా అనిపించి చూస్తే.. వామ్మో..!

వైరల్‌ వీడియో ఓ ఇంట్లోని సోఫా కనిపిస్తుంది. అందులో ఒక వ్యక్తి సోఫా మీద కూర్చుని ఉన్నాడు..అంతలోనే అతడికి ఓ దిండులో ఏదో ఉన్నట్టుగా, కదిలినట్టుగా అనిపించింది..వెంటనే ఆ దిండును చేతిలోకి తీసుకుని తడుముతూ పరీక్షించగా, దిండులో నుంచి ఏదో బుస్ బుస్ మంటూ శబ్ధాలు రావటం వినిపించింది. ఏముందా అని చూస్తుండగా, అందులో నుంచి ఒక తోకలాంటిది కనిపించింది.

Viral Video: సోఫాలో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. దిండులో ఏదో కదులుతున్నట్టుగా అనిపించి చూస్తే.. వామ్మో..!
Cobra Inside Sofa Pillow
Follow us

|

Updated on: Oct 29, 2024 | 2:47 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాలైన పాములకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వీటిలో కొన్ని విషపూరితమైన పాములు ఉంటే.. మరికొన్నిఎగిరే పాములు, రెండు తలల పాములు, తెల్లటి రంగులో కనిపించేవి, ఇలా ఎన్నో అరుదైనవి, విభిన్నమైనవి కనిపిస్తున్నాయి. పాముల వీడియోలు కొన్ని చూస్తే భయంకరంగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి. దాంతో నెటిజన్లు సైతం ఈ పాముల వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అడవులు, చెట్ల పొదలు,పుట్టల్లో ఉండే పాములు.. తరచూ జనావాసాల్లోకి వస్తుంటాయి. ఇంట్లోని మూలలు, కోళ్లు, పశువుల పాకల్లో దూరి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తుంటాయి. అలాంటిదే ఇక్కడ ఒక షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ ఓ పాము ఒక ఇంట్లోని దిండులో దూరింది. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే…

వైరల్‌ వీడియో ఓ ఇంట్లోని సోఫా కనిపిస్తుంది. అందులో ఒక వ్యక్తి సోఫా మీద కూర్చుని ఉన్నాడు..అంతలోనే అతడికి ఓ దిండులో ఏదో ఉన్నట్టుగా, కదిలినట్టుగా అనిపించింది..వెంటనే ఆ దిండును చేతిలోకి తీసుకుని తడుముతూ పరీక్షించగా, దిండులో నుంచి ఏదో బుస్ బుస్ మంటూ శబ్ధాలు రావటం వినిపించింది. ఏముందా అని చూస్తుండగా, అందులో నుంచి ఒక తోకలాంటిది కనిపించింది. దీంతో అతడు ఒకింత షాక్ తిన్నాడు.. అదేదో పాములాంటిదే అని భావించాడు..ఒక్కసారిగా అతనికి ఫ్యూజ్ లు ఎగిరిపోయినంత పనైంది. దీంతో అతను వెంటనే ఆలస్యం చేయకుండా స్నేక్ క్యాచర్‌కు కాల్‌చేసి సమాచారం అందించాడు. వెంటనే వారు వచ్చి దిండులో నక్కిన పామును బైటకు తీశారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ దిండులో దూరిన పాము అదేదో అల్లాటప్ప పాము కాదని తెలిసి స్నేక్‌ క్యాచర్‌ షాక్‌ అయ్యాడు. అది కోబ్రా పాముగా గుర్తించారు. అయితే, ఇంత పెద్ద పాము ఎలా ఈ దిండులో దూరిందో అర్థంకాక అందరూ తలలు పట్టుకున్నారు. స్నేక్‌ క్యాచర్‌ ఎంతో చాకచక్యంగా పామును బైటకు తీశాడు. దీంతో ఆ ఇంటిల్లిపాది హమ్మయ్య బతికి పోయామని ఊపిరి పీల్చుకున్నారు. ఆ పామును సమీపంలోని అటవీ ప్రాంతంలో వదలిలేసినట్లు సమాచారం. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాప్ రే.. అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ ముసుగుల్లో ఉన్న ఇద్దరూ మాములు ముదుర్లు కాదు..
ఈ ముసుగుల్లో ఉన్న ఇద్దరూ మాములు ముదుర్లు కాదు..
వైఎస్ జగన్ - షర్మిల ఆస్తులపై షాకింగ్ స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ
వైఎస్ జగన్ - షర్మిల ఆస్తులపై షాకింగ్ స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ
దీపావళికి ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌.! ఓటీటీ ప్లాన్స్ లో కూడా..
దీపావళికి ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌.! ఓటీటీ ప్లాన్స్ లో కూడా..
వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి
వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి
ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..
ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..
తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..
జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..
జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..
వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై..
వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై..
భారీ ప్రమాదం, ముఖానికి 20 కుట్లు.. నటి ఎమోషనల్ వీడియో.!
భారీ ప్రమాదం, ముఖానికి 20 కుట్లు.. నటి ఎమోషనల్ వీడియో.!