Dandari-Gussadi festival: ఆదివాసీ గూడాల్లో దండారి సంబరాలు.. అడవి బిడ్డల గుండెల్లో ఆనందోత్సహాలు

అడవి ఒడిలో ఆదివాసీ గూడాల్లో దండారి సంబరం దండిగా సాగుతోంది. మారుమూల గోండ్‌ గూడాలు గుస్సాడి నృత్యాలతో మారుమోగుతున్నాయి. వాయిద్యాల చప్పుళ్లతో గల్లు గల్లుమనే గజ్జల రవళుల మధ్య సాగుతున్న నృత్యగానాల కోలాహలంతో ఆదివాసీ గూడాలు సందడిగా మారాయి. దండారి సంబరాలు అడవి బిడ్డల గుండెల్లో ఆనందోత్సవాలను నింపుతున్నాయి.

Dandari-Gussadi festival: ఆదివాసీ గూడాల్లో దండారి సంబరాలు.. అడవి బిడ్డల గుండెల్లో ఆనందోత్సహాలు
Dandari
Follow us
Naresh Gollana

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 28, 2024 | 9:30 PM

ఆదివాసీ గూడాల్లో అంగరంగ వైభవంగా దండిగా సాగే దండారి పండుగ సంబరం మొదలైంది. డప్పుల దరువులు , గజ్జెల మోతలు , గుస్సాడీ నృత్యాలతో‌ అడవి తల్లి మురిసి పోనుంది. దండారి అంటేనే ఆదివాసీ గూడేల్లో సంబరాల వేడుక. యేటా ఆదివాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్‌ పేన్‌’ పేరిట చేసే ప్రత్యేక పండుగతో దండారి పండుగ ప్రారంభమవుతుంది. దీపావళికి ముందు భోగి పండుగతో ప్రారంభమై.. కొలబొడితో పండుగ ముగిస్తుంది. పక్షం రోజుల పాటు సాగే ఈ వేడుక తరతరాల సంప్రదాయాన్ని కొనసాగించే అద్బుత పండుగగా నిలుస్తోంది. అడవి తల్లి ఒడిలో అంగరంగవైభవంగా సాగే దండారి పండుగ ఆచారాలు , వ్యవరాలు , సంస్కృతి , సంప్రదాయాలు.. కట్టుబొట్టు రూపాలేంటో మీరు ఓ సారి తెలుసుకోవాలనుకుంటే ఆదివాసీల ఖిల్లా అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వచ్చేయండి.

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా తుడుం మోతలు, డప్పుల చప్పుల్లు , గుస్సాడీ నృత్యాల ఆటపాటలే కనువిందు చేస్తాయి. తరతరాల సంప్రదాయాన్ని తూచ తప్పకుండా పాటించే సంస్కృతి సంప్రదాయాల పుట్టినిళ్లుగా నిలుస్తూ ఆదివాసీ గూడాలు రారమ్మంటూ స్వాగతం పలుకుతాయి. డప్పుల దరువులు, గజ్జెల మోతలు, గుస్సాడీల నృత్యాలతో గూడేలన్నీ మారుమోగుతాయి. ఓ వైపు కోలాటాలు, మరోవైపు గోండిపాటల నృత్యాలు, హాస్యనాటికల ప్రదర్శనలు అబ్బురపరుస్తాయి. ఆశ్వీయుజ పౌర్ణమి అనంతరం ప్రారంభమయ్యే ఈ వేడుకలు పక్షం రోజుల పాటు అంగరంగవైభవంగా సాగుతాయి. తెలంగాణ ప్రభుత్వం దండారిని ప్రత్యేక పండుగగా కూడా గుర్తించింది. దండారి పండుగ వేళ చేసే గుస్సాడీ నృత్యాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును పొందాయి. ఈ పండుగలో ఆదివాసీల కట్టుబొట్టు ఎంత అద్బుతంగా ఉంటుందో.. పండుగ వేళ చేపట్టే దీక్ష అంత అత్యంత కఠినంగా ఉంటుంది.

దండారి వేడుకల్లో గుస్సాడీలదే కీలక పాత్ర. వారి వేశాదరణ ఆకట్టుకుంటుంది. నెత్తిపై నెమలి పించం.. ఆ పించానికి ఇరు వైపులా దుప్పి కొమ్ములు.. పించం మద్యలో తలుక్కున మెరిసి అద్దం.. భుజానికి జింక తోలు, నడుము, కాళ్లకు గళ్లుగళ్లున మోగే గజ్జెలు, మెడలో శివయ్య రుద్రాక్షమాల.. ఒంటి నిండా బూడిద.. ముఖానికి నల్లని రంగు.. ఇలా విచిత్ర వేసాదారణతో కనిపించి వీరిని గురు అని.. ఆదివాసీ దేవుని ప్రతిరూపమని పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

ఆశ్వీయుజ పౌర్ణమి మరుసటి రోజు.. భోగి పండుగతో మాలధారణ వేసి.. పది రోజుల పాటు కఠిన దీక్షను తీసుకుంటారు గుస్సాడీలు. దీక్ష పూర్తయ్యే వరకు స్నానాలు ఆచారించకుండా , ఒంటిపై నీటి చుక్క కూడా పడకుండా.. కాళ్లకు చెప్పులు దరించకుండా.. చలిలో ఒంటిపై ఎలాంటి వస్త్రాన్ని కప్పుకోకుండా అర్ధ నగ్నంతోనే గడుపుతారు. నేల పైనే కూర్చోవడం, నేలపైనే నిద్రించడం గుస్సాడీల ఆచారం. గుస్సాడీల్లో పోరీలది మరింత ప్రాముఖ్యత. ఆడ వేషధారణలో ఉండే యువకులను ఆదివాసీలు పోరీలని పిలుస్తారు. ఏ ఊరికి వెళ్లినా.. ఏ ఇంటిని సందర్శించిన ఈ పోరీలు మంగళహారతులతో అష్ట, ఐశ్వర్యాలు కలగాలని, కుటుంబ సభ్యులందరికీ సుఖశాంతులు కలగాలనీ దీవిస్తారు.

దీపావళి పండుగనే ఆదివాసీలకు పెద్ద పండుగ.. అందులో భాగంగానే గోండులకు ఆరాధ్యదైవమైన ఏత్మాసూర్‌ పద్మల్‌పురి కాకో ఆలయానికి భక్తజన దండు కదిలింది. మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలో కొలువై ఉన్న పద్మల్‌ పురి కాకో ఆలయానికి తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా మ‌హారాష్ట్ర , చత్తీస్‌గఢ్‌, ఒడిస్సా ప్రాంతాల నుంచి ఆదివాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు.

దండారీ పండుగ అంటేనే ఐక్యమత్యానికి నిదర్శనం. ఈ పండుగ వేళ ఆదివాసీ గ్రామాల గిరిజనం ఒక ఊరు నుండి మరో ఊరికి విడిదికి వెళ్లడం ఆనవాయితీ‌. మారు మూల గిరిజన గ్రామాల గిరిజనం దండారి పండుగ వేళ ఓ గ్రామం నుండి దండారి బృందంతో మరో గ్రామానికి బయలు దేరి వెళుతారు‌. అలా చేయడం ద్వారా రెండు గ్రామాల మద్య సత్సంబంధాలు , భాందవ్యాలు పెరుగుతాయని చెప్తారు ఆదివాసీ పటేళ్లు‌. ఇలా విడిదికి వెళ్లే దండారీ బృందం కాలినడకనే ఎంచుకుంటారు.. అందులోను రాత్రి పూట మాత్రమే వెళ్లడం వారి ఆచారం. రాత్రంత నృత్యాలు చేస్తూ, రేలారేలా ఆటపాటలతో.. గోండి హాస్యపు నాటికలు ప్రదర్శించి ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తారు ఈ గుస్సాడీలు. తెల్లవారగానే కాలకృత్యాలు తీర్చుకుని మాన్‌కోలాతో నృత్య ప్రదర్శనలు చేసి సాయంత్రం సార్‌కోలాతో ముగిస్తారు. ఈ సందర్భంగా వచ్చిన అథితులకు ఘన స్వాగతం పలికి.. ప్రత్యేక విందును ఏర్పాటు చేసి అతిధులకు వీడ్కోలు పలుకుతారు ఆదివాసీలు. అలా తమ గూడానికి వచ్చిన గుస్సాడీలతో ఆత్మీయ బంధం ఏర్పడి.. రెండు గూడాల మద్య స్నేహబందం మరింత బలపడి.. తరతరాలుగా కొనసాగిస్తున్న సంస్కృతీ సంప్రదాయల పరిరక్షణకు తోడ్పడుతుందనేది వారి భావన.

దండారి పండుగ వేళ ఆదివాసీలు కొలిచే ఆరాధ్య దేవత పద్మల్‌పురికాకో. ఈ పండుగలో ఏత్మాసార్‌ పేన్‌ పేరిట నాల్గు సగ(గోత్రం)లలో ఉత్సవాలు జరుపుకుంటారు గిరిజనులు. నాల్గు సగలవారు అంటే గుమ్మేల, 5 సగల వారు అంటే ఫర్ర, 6 సగల వారు అంటే కోడల్‌, 7 సగల వారు అంటే తపల్‌ పేరిట ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ దండారి వేడుకల్లో భేటికోలా, మాన్‌కోలా, సదర్‌కోలా, కోడల్‌కోలా, సార్‌కోలా, కలివల్‌కోలా అనే నృత్యాలు చేయడం ఆదివాసీలకే సొంతం. పేర్లు ఎంత వైవిధ్యం గా ఉన్నాయో వారి ఆటపాటలు కూడా అంతే వైవిద్యం గా సాగుతాయి. చచోయ్‌ ఇట్‌ కోలారా.. దేనే దేనారా.. రేలా.. రేలా.. లాంటి ఆట పాటల నడుమ పద్మల్‌పురి కాకో ఆలయం వేదికగా దండారి ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతాయి.

ఈ దండారి పండుగ వేళ మహారాష్ట్ర , చత్తీస్‌గఢ్ , తెలంగాణ లోని ఆదివాసీలు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలోని ఆరాధ్యదైవం పద్మల్‌పురి కాకో ఆలయంలో దండారి వేడుకలు అంగరంగవైభవంగా జరుపుతారు‌. పద్మల్‌పురి కాకో ఆలయాన్ని దండారి ఉత్సవ వేదికగా ఆదివాసులు భావిస్తారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం గుస్సాడి నృత్యాలు ప్రారంభించి, దీపావళి వరకు తమ తమ గూడేల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు. దీపావళి రెండు రోజుల తరువాత కొలబొడితో ఈ దండారి వేడుకలు ముగిస్తాయి. తమ కార్యక్రమాలు, అతిథుల రాకపోకలు పూర్తి కాగానే గ్రామంలోని దండారి బృందం ఇంటింటికీ వెళ్లి దర్శనం ఇస్తారు. దీంతో ఇంటి గృహిణి ఓ పల్లెంలో ధాన్యాలు, తోచిన నగదు ఉంచిన హారతిని వారికి అందిస్తారు. దానిని వారు సంతోషంగా స్వీకరించి ఇంట్లో అందరూ బాగుండాలని, పాడిపంటలు సమృద్ధిగా పెంపొందాలని పాటలు పాడుతూ హారతి పూజ ఇస్తారు. ఇలా అన్ని ఇండ్లు పూర్తి కాగానే.. కొలబొడి నిర్వహించి కార్యక్రమాన్ని ముగిస్తారు. ఛలో ఇంకెందుకు ఆలస్యం.. ఇంత అపురూప వేడుకను కనులరా చూసోద్దాం పదండి.. పచ్చని ప్రకృతిలో అంతే స్వచ్ఛంగా సాగే దండారి దండి సంబురాలను తిలికించి తరిద్దాం రండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
16 ఫోర్లు, 11 సిక్సర్లు.. నువ్వు మనిషివా మానవ మృగానివా భయ్యా..
16 ఫోర్లు, 11 సిక్సర్లు.. నువ్వు మనిషివా మానవ మృగానివా భయ్యా..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!