Hyderabad: నగరంలో పబ్స్‌పై హైకోర్టు ఘాటు కామెంట్స్.. పోలీసులకు కీలక ఆదేశాలు
హైదరాబాద్‌లో పబ్బుల యవ్వారం గబ్బు రేపుతోంది. బడా బాబుల పిల్లలు పబ్బుల్లో తెగ తాగి, రోడ్లపై ర్యాష్ డ్రైవింగులతో యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ చూసి చిర్రెత్తుకొచ్చిన తెలంగాణ హైకోర్టు ఘాటు కామెంట్లు చేసింది. పబ్బులకు కళ్లెం వేయాలని పోలీసులను ఆదేశించింది.
హైదరాబాద్‌లో పబ్‌ల తీరుపై హైకోర్టు సీరియస్ అయింది. పబ్‌లకు వచ్చేవాళ్ల వ్యవహారం పైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. బడాబాబులు సంపాదిస్తుంటే వాళ్ల పిల్లలు పబ్బుల దగ్గర హంగామా చేస్తున్నారంటూ జస్టిస్ విజయ్‌సేన్ ఘాటు కామెంట్లు చేశారు. బడా బాబుల పిల్లలు…ర్యాష్ డ్రైవింగ్‌లు చేస్తూ యాక్సిడెంట్లు చేస్తున్నారన్నారు న్యాయమూర్తి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోనే 60 దాకా పబ్బులు ఉన్నాయని, పబ్‌ల వల్ల రోడ్ నెంబర్ 12, రోడ్ నెంబర్ 36లలో రోజుకో ప్రమాదం జరుగుతోందని జస్టిస్ విజయ్‌సేన్ వ్యాఖ్యానించారు. పబ్బుల దగ్గర ప్రత్యేక డ్రైవ్‌లు పెట్టాలని, పబ్‌లు కూడా ప్రత్యేక ఏర్పాట్లు, నిబంధనలు పాటించాలన్నారు న్యాయమూర్తి. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు
జన్వాడ ఫైల్స్ కేసు విచారణ సందర్భంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్…జస్టిస్ విజయ్‌సేన్ బెంచ్‌కి వచ్చారు. విచారణ పూర్తయిన క్రమంలో పబ్బుల విషయంలో ఏఏజీతో న్యాయమూర్తి కీలక కామెంట్లు చేశారు. మీరు ఇక్కడే ఉన్నారు కదా? పబ్బుల విషయంలో ఎందుకిలా జరుగుతోందంటూ ఏఏజీని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రమాదాలను నివారించేందుకు పబ్బుల బయట స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని, పబ్‌లకు మరిన్ని నిబంధనలు విధించాలని ఏఏజీకి సూచించారు హైకోర్టు జస్టిస్ విజయ్‌సేన్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..