Hyderabad: దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా…? సర్క్యులేట్ అవుతున్న న్యూస్‌లో నిజమెంత..?

ఒకప్పుడు పండుగొస్తుందంటే సంబరాలు తెచ్చేది..కానీ ఇప్పుడు పండగొస్తుందంటే వివాదాలు తెస్తోంది. ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై వివాదం...ఎలా జరుపుకోవాలన్నదానిపై వివాదం...ఎలా జరపకూడదు అన్నదానిపై వివాదం...ఇలాంటి వివాదాల నడుమ...ఆంక్షలు..ఇంకేముంది సగం పండగ సంబరం వివాదాలతోపోతే...మరో సగం..ఆంక్షలతో ఆవిరైపోతోంది..ఇప్పుడు దీపావళి పండుగ సంబరం కూడా ఇలాంటి వివాదాలతో చిక్కుకుంది. ఇంతకూ దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా...? సర్క్యులేట్ అవుతున్న న్యూస్‌లో నిజమెంత..?

Hyderabad: దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా...? సర్క్యులేట్ అవుతున్న న్యూస్‌లో నిజమెంత..?
Police Commissioner CV Anand
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 28, 2024 | 10:15 PM

దీపావళి పండుగ అంటేనే పటాకులు పేలాల్సిందే. కాకరపుల్లలు, చిచ్చుబుడ్లు, భూచక్రాల నుంచి మొదలుపెట్టి.. థౌసెండ్ వాలాలు, లక్ష్మీబాంబులు ఇలా పేర్లు ఏవైనా.. మోత మోగిపోవాల్సిందే. ఇటు భూమి మీద పేల్చే బాంబులే కాదు.. ఆకాశానికి దూసుకెళ్లి మిరుమిట్లుగొలిపే పటాసులు కూడా పెద్ద ఎత్తున కాలుస్తుంటారు. ఎంత ఎక్కువ కాలిస్తే.. అంత ఎక్కువ పండుగను ఎంజాయ్ చేసినట్టు. పండుగ రోజే కాదు.. దీపావళి వస్తుందంటే నాలుగైదు రోజుల ముందు నుంచే పటాకులు పేలుతూనే ఉంటాయి. మళ్లీ కార్తీక పౌర్ణమి వరకు ఈ మోత మోగుతూనే ఉంటాయి…

ఇలాంటి సంబరంలో పోలీసులు ఆంక్షలు పెట్టారన్న పుకారు ఇప్పుడు తెలుగు జనాలను ఆందోళనలో పడేసింది. క్రాకర్స్ కాల్చటంపై హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు పెట్టారని.. వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. పలు నిబంధనలు పెట్టారంటూ నెట్టింట ఓ న్యూస్ వైరల్ అయింది. పండుగ రోజు రెండు గంటలు మాత్రమే అదీ 8 నుంచి 10 గంటల వరకే క్రాకర్స్ కాల్చాలన్న నిబంధనలు పెట్టారని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి. సరిగ్గా ఆ సమయంలోనే హైదరాబాద్ పరిధిలో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో కొన్ని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

దీనిపై పోలీసుల నుంచి క్లారిటీ వచ్చింది. రకరకాల ఆందోళనలు.. సచివాలయం, సీఎం నివాసం, డీజీపీ కార్యాలయం, రాజ్‌భవన్ మొదలైన వాటిపై ఆకస్మిక దాడులకు కొన్ని గ్రూప్లు ప్లాన్ చేశారని ఇంటిలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని.. అందుకే 144 సెక్షన్ అమలులోకి తీసుకొచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ ఉత్తర్వులకు హైదరాబాద్‌లో దీపావళి వేడుకలకు ఎలాంటి సంబంధం లేదని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ ఎక్స్‌ వేదికగా స్పష్టం చేశారు.

మరోవైపు హైదరాబాద్‌ అబిడ్స్‌ పరిధిలోని బొగ్గుల కుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారాస్‌ బాణాసంచా దుకాణంలో జరిగిన పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న ఓ హోటల్‌కు మంటలు వ్యాపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. రాత్రి విక్రయాలు జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. భారీగా ఆస్తి నష్టం జరిగింది. పారాస్ దుకాణం పర్మిషన్ ఇచ్చిన చోటు కాకుండా మరోచోట పెట్టినట్లు అధికారులుగుర్తించారు . ఇలా నిబంధనలు అతిక్రమించే షాపులకు ఫైర్ సేఫ్టీ విభాగం నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి. టపాసు దుకాణాలకు పలు నిబంధనలతో కూడిన సర్క్యులర్ జారీ అయింది. ఓపెన్ ప్లేసుల్లో మాత్రమే దుకాణాలు తెరవాలని…పిల్లలను అనుమతించకూడదని తెలిపింది. ప్రతి ఫైర్ షాపు దగ్గర 200 లీటర్స్ వాటర్ డ్రమ్ములు, బకెట్స్ కచ్చితంగా ఉండాలని ఆదేశించింది.

టపాసు దుకాణాలపై ఆంక్షలు తప్ప…పండుగ జరుపుకునే విషయంలో ఎలాంటి కండీషన్స్ లేవు. అయితే దేశవ్యాప్తంగా పలుచోట్ల దీపావళిపై ఆంక్షలున్నాయి. కాలుష్యం విపరీతంగా ఉండే ఢిల్లీ లాంటి ప్రదేశంలో కోర్టు గైడ్‌లైన్స్ తప్పకుండా పాటించాలన్న నిబంధన ఉంది. ఢిల్లీలో క్రాకర్స్ కాల్చటం టోటల్‌గా నిషేధం. అక్కడ అమ్మకూడదు..కొనకూడదు. కొన్ని ప్రాంతాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం.. 55 డెసిబెల్స్ మించి శబ్ధం చేసే క్రాకర్స్ కాల్చకూడదు. అలాగే గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని , అమ్మాలన్న నిబంధన కూడా ఉంది. అయితే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేకుండా గ్రీన్ క్రాకర్స్‌కు ప్రిఫరెన్స్ ఇస్తే మంచిదని పర్యావరణ వేత్తలు సూచన.

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..