AP News: ఇదెక్కడి వరద రా మావా! జేసీబీలే కొట్టుకుపోతున్నాయ్..

ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య విపరీతమైన వరదలు వస్తున్నాయి. ఇటీవల బుడమేరు వాగు ఎంత విధ్వంసం సృష్టించిందో మనందరీకి తెలిసిందే.. తాజాగా మరో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. జేసీబీలే కొట్టుకుపోతున్నాయ్.. ఎక్కడో తెలుసా?

AP News: ఇదెక్కడి వరద రా మావా! జేసీబీలే కొట్టుకుపోతున్నాయ్..
Flood To Gundeti River
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Oct 31, 2024 | 1:25 PM

ఏలూరు జిల్లాలోని  కుక్కునూరు మండలం దాచారం గుండేటి వాగుకు ఆకస్మికంగా వరద వచ్చింది. దీంతో జేసీబీలు కొట్టుకుపోతున్నాయ్. గుండేటి వాగు వరద ఉధృతితో విద్యుత్ మోటర్లు నీటిపాలైయ్యాయి. వాగు ప్రవాహం ఎక్కువ అవ్వడంతో వరదలో జేసీబీ కొట్టుకుపోవడంతో డ్రైవర్ ప్రాణాలతో ఎలాగోలా బయటపడ్డాడు. పంట పొలాలకు నీరు తోడే విద్యుత్ మోటర్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

వీడియో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి