ఆ ముద్దుగుమ్మకు పోటీ లేదు.. స్టార్ హీరోయిన్స్ కూడా ఆవిడనే ఫాలో అయ్యేవారన్న బాలయ్య
నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ 2 తాండవం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు బాలయ్య తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు.

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నారు బాలయ్య. వరుసగా ఐదు హిట్స్ తో రాణిస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ, తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఆదిత్య 369 చిత్రం గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా దివంగత నటి సిల్క్ స్మిత ఆ సినిమాలో పోషించిన పాత్ర, ఆమెతో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన గురించి వివరించారు బాలయ్య.
ఆదిత్య 369లో ఒక కీలక సన్నివేశంలో సిల్క్ స్మితకు పెద్ద డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. ఆ డైలాగ్‌లో ‘ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు, ఈ నికృష్ట, బ్రష్టా, పాపిష్ట, కల్మిష పూయిష్టుడు’లాంటిపదాలున్నాయి. అయితే, తమిళ నేపథ్యం నుండి వచ్చిన సిల్క్ స్మితకు ఈ క్లాసిక్ తెలుగు పదాలను సరిగ్గా పలకడం కష్టమైందట. అనేక టేకుల తర్వాత, ఆవిడ ఉన్నట్టుండి డైలాగ్‌ను ఇంగ్లీషులో ‘దిస్ ఫూల్, దిస్ ఇడియట్, దిస్ బాస్టర్డ్, దిస్ రాస్కెల్’ అంటూ చెప్పి, డైరెక్టర్ గారు, ఓకేనా అండి.? అని అడిగారట. ఈ సంఘటనతో సెట్‌లో ఉన్న బాలకృష్ణతో సహా అందరూ ఆశ్చర్యపోయారట. తర్వాత డైరెక్టర్ ఆశ్చర్యపోతూ, అమ్మా, నువ్వు మాట్లాడింది అంతా ఇంగ్లీషులో, అన్నీ తిట్లే కదా.. అని సరదాగా అన్నారని బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు.
ఇలాంటి సరదా సంఘటనలు ఆ సినిమా చిత్రీకరణలో చాలా జరిగాయని ఆయన తెలిపారు. సిల్క్ స్మితకు సాధారణంగా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కే పరిమితమైన ఇమేజ్ ఉండేదని, కేవలం ఐటమ్ సాంగ్ అంటే సిల్క్ స్మిత అనేంతగా ఆమె గుర్తింపు పొందిందని బాలకృష్ణ అన్నారు. అయితే, ఆదిత్య 369 సినిమాలో ఆమెకు పూర్తి నిడివి పాత్ర ఇవ్వడం వెనుక ఉన్న ఆలోచనను ఆయన వివరించారు. ఈ పాత్రకు సిల్క్ స్మిత మాత్రమే సరిపోతారని డైరెక్టర్, ప్రొడ్యూసర్ దృఢంగా భావించారని ఆయన చెప్పారు. ఆమెకు సహజంగా ఉండే శరీర రంగు, ఆమె మేకప్, కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా ఉండేవని, అప్పటి స్టార్ హీరోయిన్లు శ్రీదేవి వంటి వారు కూడా ఆమె మేకప్, దుస్తులను చూసి ఆవిడను ఫాలో అయ్యేవారని బాలకృష్ణ అన్నారు. సిల్క్ స్మిత హీరోయిన్ కాదని, ప్రధానంగా డాన్సర్ అయినా కూడా ఆమె స్టైల్ ను స్టార్ హీరోయిన్స్ కూడా ఫాలో అయ్యేవారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




