నాకు పీరియడ్స్ అని చెప్పినా ఆ దర్శకుడు వినలేదు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ మీడియా ముందుకు వచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. కొందరు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బారిన పడితే మరికొందరు బయట సమాజంలో తమకు ఎదురైన అనుభవాలను దైర్యంగా చెప్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా షాకింగ్ విషయాలు పంచుకుంది.

నటి పార్వతి తిరువోతు.. ఈ అమ్మడు మలయాళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ. ధనుష్ తో మర్యాన్, దుల్కర్ సల్మాన్ తో బెంగుళూరు డేస్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా పార్వతి తిరువోతు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలు పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె డిప్రెషన్, సెక్స్ ఎడ్యుకేషన్ లోపం, డేటింగ్, శారీరక వేధింపులు వంటి అంశాలపై ఆమె షాకింగ్ విషయాలు చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో పార్వతి మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల నుంచి తనకు సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం గురించి మాట్లాడింది. పదేళ్ల క్రితం తల్లిని అడిగినప్పుడు, ఆమె చెప్పిన సమాధానం నన్ను నిరాశపరిచింది. అయితే, మూడన్నర సంవత్సరాల బ్యాచిలర్ లైఫ్ తర్వాత తన తల్లి ప్రోత్సాహంతో డేటింగ్ ప్రారంభించడం ఆశ్చర్యపరిచిందని చెప్పుకొచ్చింది పార్వతి.
బాల్యంలో ఎదురైన శారీరక వేధింపులు తన జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయని పార్వతి తెలిపింది. 12-13 సంవత్సరాల వయస్సులో రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి తన ఛాతీపై కొట్టిన సంఘటన తన జీవితంలో ఎదురైనా చేదు అనుభవం అని తెలిపారు పార్వతి. అదేవిధంగా ధనుష్ హీరోగా నటించిన మర్యాన్ సినిమా షూటింగ్‌లో పీరియడ్స్ సమయంలో ఎదురైన ఇబ్బందులను ఆమె తెలిపింది. మొదటి రోజు షూటింగ్ లో నేను పూర్తిగా నీటిలో తడిసి ఉండాలి, అలాగే హీరోతో రొమాన్స్ చేసేసన్నివేశం అది. అయితే ఆ సమయంలో దర్శకుడు దగ్గరికి వెళ్లి, హోటల్‌కి వెళ్లి బట్టలు మార్చుకోవడానికి బ్రేక్ కావాలని చెప్పాను. అప్పుడు వాళ్ళు ‘లేదు లేదు’ అన్నారు. నా ఇబ్బందిని అర్ధం చేసుకోలేకపోయారు. నేను చెప్తున్నా కూడా వాళ్లకు అర్ధం కాలేదు. అప్పుడు నేను ‘నేను పీరియడ్స్‌లో ఉన్నాను అని గట్టిగా అరిచి చెప్పాల్సి వచ్చింది అని తెలిపింది పార్వతి.
అదేవిధంగా శరీర మార్పుల గురించి తల్లిదండ్రుల నుంచి అవగాహన లేకపోవడం, స్నేహితుల ఆటపట్టించడం వంటివి తనను కుంచించుకుపోయేలా చేశాయని తెలిపారు. ఒకానొక సమయంలో ఛాతీ నొప్పితో డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ఎదురైన అవమానకరమైన అనుభవాన్ని కూడా ఆమె పంచుకున్నారు. ఆ డాక్టర్ తనతో వల్గర్ గా ప్రవర్తించాడు అని తెలిపారు. అది తన మొదటి శారీరక లైంగిక దాడి కావడంతో ఫిజికల్ టచ్ అంటే ఇప్పటికీ భయం ఉందని ఆమె అన్నారు. పార్వతి తన జీవితంలో చాలా చీకటి క్షణాలను చూశానని, ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని చెప్పారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
