సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన డైరెక్టర్ తేజ్ కొడుకు.. భారీ మొత్తంలో టోకరా
చిత్రం, నువ్వునేను, జయం, సంబరం, జై, ధైర్యం, ఔనన్నా కాదన్నా.. ఇలా ఎన్నో ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించారు డైరెక్టర్ తేజ. అంతేకాదు తన సినిమాల ద్వారా ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్, కాజల్ అగర్వాల్, ప్రిన్స్, నందిత వంటి స్టార్ హీరోలు, హీరోయిన్లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ప్రజలను మోసం చేస్తూ కోట్లకు కోట్లు నొక్కేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. తాజాగా ఓ దర్శకుడి కొడుకు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. మాయమాటలు చెప్పి ఆ దర్శకుడి కొడుకు దగ్గర ఏకంగా రూ. 63లక్షలు కాజేశారు. ఇంతకూ ఆ దర్శకుడు ఎవరో కాదు ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న తేజ. పేమ కథ చిత్రాలకు పెట్టింది పేరు తేజ. తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు తేజ. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ సినిమాల స్పీడ్ తగ్గించేశారు. తాజాగా తేజ కొడుకు తాజాగా సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు.
తేజ కొడుకు అమితవ్ ను కొందరు కేటుగాళ్లు ట్రేడింగ్ లో భారీగా లాభాలు వస్తాయని నమ్మించి ఓ దంపతులు మోసం చేశారు. అమితవ్ వద్ద నుంచి రూ. 63లక్షలు కాజేసినట్లు ఆ దంపతులపై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా బిజినెస్ లో బిజీగా ఉన్నాడు అమితవ్ తేజ. 2025 ఏప్రిల్‌లో మోతీనగర్‌కు చెందిన యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్ దంపతులతో ఆయనకు పరిచయం ఏర్పడింది.
ఆతర్వాత అతనికి మాయమాటలు చెప్పి.. ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని, లాభాలు వచ్చేలా చేస్తామని ఒకవేళ నష్టం వస్తే.. తాము నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ను ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో ఆ దంపతుల మాటలు నమ్మిన అమితవ్.. రూ. 63 లక్షలు పెట్టుబడిపెట్టారు.అతన్ని నమ్మించడానికి వారం రోజుల తరువాత రూ. 9 లక్షలు లాభం వచ్చిందంటూ ఏవో పేపర్స్ తో బురిడీ కొట్టించారు. దీనిని నిజమని నమ్మిన అమితవ్ భారీగా డబ్బును నేరగాళ్ల చేతిలో పెట్టాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
