AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రొటోకాల్ ఆఫీసర్ .. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ యాక్టర్.. ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. నటించాలని, మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చాలా మంది కలలు కంటారు. అందుకోసం ఎలాంటి త్యాగాలైనా చేస్తారు. వెండితెరపై కనిపించేందుకు లక్షల జీతమొచ్చేపెద్ద పెద్ద జాబులైనా ఈజీగా వదులుకుంటారు. ఈ టాలీవుడ్ నటుడు సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు.

Tollywood: ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రొటోకాల్ ఆఫీసర్ .. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ యాక్టర్.. ఎవరో తెలుసా?
Vadlamani Srinivas
Basha Shek
|

Updated on: Jan 14, 2026 | 2:09 PM

Share

‘డాక్టర్ అవ్వాల్సింది అనుకోకుండా యాక్టర్ అయ్యాను’, ‘ఇంజనీర్ అవ్సాల్సింది.. కొన్ని కారణాలతో ఇండస్ట్రీలోకి వచ్చాను’ .. సినిమా సెలబ్రిటీల నోటి నుంచి తరచూ వచ్చే డైలాగులు ఇవి. ఇంకొంతమంది మల్టీ నేషనల్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలో ఉద్యోగాలు వదులుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నటనపై మక్కువతో చాలా మంది లక్షల జీతాలు, లగ్జరీ లైఫ్ ను వదిలి పెట్టి మరీ కెమెరాముందుకు వచ్చారు. ఈ టాలీవుడ్ స్టార్ నటుడు కూడా సరిగ్గా ఇదే జాబితాకు చెందుతాడు. గోదావరి ప్రాంతానికి చెందిన ఇతను ఎన్నో ఉన్నత చదువులు అభ్యసించాడు. చిన్నతనం నుంచే సినిమాలు, సాహిత్యం మీద మక్కువ ఉన్నా ఎప్పుడూ నటుడు అవ్వాలని అనుకోలేదు. బుద్దిగా ఉన్నత చదువులు చదువుకొని ఏకంగా జాయింట్ కలెక్టర్ అయ్యాడు. వైజాగ్ నగరంలో కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. ఇదే సమయంలో ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఒక ఫేమస్ డైరెక్టర్ తన సినిమాలో ఈయనకు ఒక చిన్న పాత్ర ఇచ్చాడు. సినిమా రిలీజ్ తర్వాత తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఓవైపు జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే చేస్తూనే పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత నటనపైనే పూర్తిగా దృష్టి సారించారు. దీంతో గవర్నమెంట్ నౌకరీకి రాజీనామా చేయక తప్పలేదు. విలన్ గా, సహాయక నటునిగా మెరుస్తోన్న అతను మరెవరో కాదు వడ్లమాని శ్రీనివాస్. ఇలా పేరు చెబితే గుర్తు పట్టలేరు కానీ కింది ఫొటోలు చూస్తే ఈయనేనా? అని ముక్కున వేలేసుకుంటారు.

కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు శ్రీనివాస్. గీత గోవిందం, ప్రతిరోజు పండగే, శైలజా రెడ్డి అల్లుడు, ‘నా సామి రంగా, ఎఫ్ 2, ఎఫ్ 3, భగవంత్ కేసరి, పెదకాపు.. ఇలా ఇప్పటివరకు దాదాపు 70 సినిమాల్లో యాక్ట్ చేశారీ సీనియర్ నటుడు.ముఖ్యంగా పెదకాపు సినిమాలో వడ్లమాని పోషించిన గెటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఎఫ్ 2 సినిమాలోనూ తన కామెడీతో కడుపుబ్బా నవ్వించారీ శ్రీనివాస్.

ఇవి కూడా చదవండి

వడ్లమాని శ్రీనివాస్  ఫొటోస్..

ఇటీవల రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన శంకరవరప్రసాద్ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించారు  వడ్లమాని శ్రీనివాస్. అలాగే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ది రాజాసాబ్ సినిమాలోనూ ఓ ప్రధాన పాత్ర లో కనిపించారు. ఈ మూవీ సక్సెస్ మీట్లలో భాగంగానే తాను గతంలో చంద్రబాబు ప్రోటోకాల్ ఆఫీసర్ గా పనిచేశామనని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వరుణ్ సందేశ్ వైఫ్ యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందంటే.?
వరుణ్ సందేశ్ వైఫ్ యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందంటే.?
ఒకప్పుడు చంద్రబాబు ప్రొటోకాల్ ఆఫీసర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్
ఒకప్పుడు చంద్రబాబు ప్రొటోకాల్ ఆఫీసర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్
సముద్రంలో అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అమేజింగ్ వీడియో
సముద్రంలో అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అమేజింగ్ వీడియో
10,000 అడుగుల మ్యాజిక్.. రోజూ నడిస్తే మీ శరీరంలో జరిగే అద్భుత..
10,000 అడుగుల మ్యాజిక్.. రోజూ నడిస్తే మీ శరీరంలో జరిగే అద్భుత..
సంక్రాంతి నాడు నువ్వుల లడ్డు ఎందుకు తింటారు? ప్రాముఖ్యత తెలుసా?
సంక్రాంతి నాడు నువ్వుల లడ్డు ఎందుకు తింటారు? ప్రాముఖ్యత తెలుసా?
పాము కాటేసిందనీ.. చొక్కా జేబులో వేసుకుని ఆస్పత్రికెళ్లాడు! వీడియో
పాము కాటేసిందనీ.. చొక్కా జేబులో వేసుకుని ఆస్పత్రికెళ్లాడు! వీడియో
చైనీస్ మాంజాను ఏలా రక్షించుకోవాలో తెలుసా?
చైనీస్ మాంజాను ఏలా రక్షించుకోవాలో తెలుసా?
పొట్ట ఐస్‌లా కరగాల్సిందే.. రోజూ సోంపును ఇలా తీసుకుంటే అద్భుతాలే..
పొట్ట ఐస్‌లా కరగాల్సిందే.. రోజూ సోంపును ఇలా తీసుకుంటే అద్భుతాలే..
టాస్ గెలిచిన కివీస్..బ్యాటింగ్‌కు దిగనున్న టీమిండియా
టాస్ గెలిచిన కివీస్..బ్యాటింగ్‌కు దిగనున్న టీమిండియా
అంత్యక్రియలు చేస్తుండగా.. ఊహించని షాక్..!
అంత్యక్రియలు చేస్తుండగా.. ఊహించని షాక్..!