Varun Sandesh: వరుణ్ సందేశ్ వైఫ్ యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందంటే.?
నటుడు వరుణ్ సందేశ్ తనపై గతంలో వచ్చిన రూమర్లపై ఓ ఇంటర్వ్యూలో . పెళ్లికి ముందు కొన్ని రిలేషన్‌షిప్స్‌లో ఉన్నానని, కానీ పెళ్లి తర్వాత అలాంటివి లేవని తెలిపాడు. భార్య వితిక షేరు యూట్యూబ్ ఛానెల్ ఆదాయంపై కూడా కీలక కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో తనపై వచ్చిన డేటింగ్ రూమర్ల గురించి మాట్లాడారు. తాను ఏ ఈవెంట్ కి వెళ్ళినా, ఆడియో ఫంక్షన్‌కి వెళ్ళినా తన గురించి ‘వరుణ్ ఈమెని డేట్ చేస్తున్నాడు, వరుణ్ ఆమెని డేట్ చేస్తున్నాడు’ అంటూ పుకార్లు వ్యాపించారని.. మొదట్లో కొంచెం బాధపడినప్పటికీ, అవి వట్టి పుకార్లే కాబట్టి.. ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదని తెలిపాడు.
ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’
పెళ్లికి ముందు రెండు మూడు సీరియస్ రిలేషన్‌షిప్స్‌లో ఉన్నానని ఒప్పుకున్నాడు. కానీ పెళ్లయ్యాక అలాంటివి ఏవీ లేవని చెప్పాడు. తన భార్య వితికపై తనకు గౌరవం ఉందని స్పష్టం చేశాడు. అలాగే ఇంట్లో తానే డామినేట్ చేస్తానని సరదాగా బదులిచ్చాడు. హ్యాపీ డేస్ సినిమాతో తనతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన నిఖిల్, తమన్నా, రాహుల్ లాంటివారు ఇప్పుడు వరుసగా ఛాన్స్‌లు దక్కించుకోవడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని తెలిపాడు. నిఖిల్, తమన్నా పెద్ద స్టార్లుగా ఎదిగారు. రాహుల్ భజే వాయు వేగం సినిమాలో మళ్లీ కంబ్యాక్ ఇచ్చాడు. తమన్నాను కలిసి చాలా ఏళ్లు అయిందని తెలిపాడు.
తన భార్య వితిక షేరు యూట్యూబ్ ఛానెల్ ఆదాయం గురించి చెబుతూ.. రఫ్‌గా ఐడియా ఉందని.. నెలకు రూ. 10 నుంచి15 లక్షల వస్తుందని చెప్పాడు. వితిక తన కంటెంట్‌ను ఎలా చేయాలనే దానిపై తాను ఎప్పుడూ సలహాలు ఇవ్వనని, కేవలం ఆమె సర్ప్రైజ్‌గా కెమెరా తిప్పినప్పుడు మాత్రమే తాను ఇన్వాల్వ్ అవుతానని వివరించాడు.
ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




