AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇద్దరి వల్లే జబర్దస్త్ నుంచి నన్ను తీసేశారు.. మనసులో మాట చెప్పిన తిరుపతి ప్రకాష్

జబర్దస్త్ నటుడు తిరుపతి ప్రకాష్ తన నిష్క్రమణ వెనుక అసలు కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. టీఆర్పీ రేటింగ్స్, ఇతర కారణాలతో తనను తొలగించారని అతడు తెలిపాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.

ఆ ఇద్దరి వల్లే జబర్దస్త్ నుంచి నన్ను తీసేశారు.. మనసులో మాట చెప్పిన తిరుపతి ప్రకాష్
Tirupati Prakash
Ravi Kiran
|

Updated on: Jan 14, 2026 | 2:16 PM

Share

జబర్దస్త్ నటుడు తిరుపతి ప్రకాష్ షో నుంచి తన నిష్క్రమణ వెనుక అసలు కారణాలను, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. హీరో శ్రీకాంత్‌తో అమెరికాలో ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు వచ్చిందని, దీని కోసం జబర్దస్త్ టీం డైరెక్టర్లను అనుమతి అడిగానని ప్రకాష్ చెప్పాడు. రెండు మూడు నెలల తర్వాత తిరిగి వస్తానని, బ్యాకప్‌గా ఉంటానని చెప్పినా, వారు నిరాకరించి ‘నువ్వు అసలు చేయాలి’ అని తేల్చి చెప్పినట్లు వివరించాడు. అయితే, అతడి స్కిట్లు రద్దు చేయడం, తన స్థానంలో పంచ్ ప్రసాద్, జబర్దస్త్ నరేష్‌లను తీసుకువచ్చారని ప్రకాష్ ఆరోపించాడు. వారిలో ఒకరికి కిడ్నీ సమస్య ఉందని, కిడ్నీ మార్పిడి జరిగిందని, వారి కోసమే తనను తొలగించారని తనకు తర్వాత తెలిసిందని అతడు చెప్పాడు. టీమ్ లీడర్లను నియమించడం, తొలగించడం విషయంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డికి సంబంధం లేదని, రాధాకృష్ణ అనే వ్యక్తి అన్నింటినీ చూసుకుంటారని ప్రకాష్ వివరించాడు.

ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’

జబర్దస్త్‌లో తాను ఉన్నప్పుడు షోకు 14-15 టీఆర్పీ రేటింగ్ ఉండేదని, ఇప్పుడు అది మూడుకు పడిపోయిందని గుర్తు చేశాడు. ఒకసారి టీఆర్పీ 9.8కి పడిపోతే, శ్యామ్ ప్రసాద్ రెడ్డి తక్షణమే మీటింగ్ పెట్టేవాడని, ‘రెండు అంకెలలోకి ఎందుకు పడిపోయింది?’ అని ప్రశ్నించేవారని ప్రకాష్ పేర్కొన్నాడు. తన తల్లి సిఓపిడి సమస్యతో బాధపడుతూ 2015 నుంచి 2019 వరకు సుమారు 12 సార్లు అపోలో ఆసుపత్రిలో చేరారని, తొమ్మిది సార్లు వెంటిలేటర్‌పై ఉన్నారని తిరుపతి ప్రకాష్ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ నాలుగేళ్ల వయస్సులో తల్లి వైద్యం కోసం దాదాపు 28 నుంచి 30 లక్షల ఖర్చు చేశానని అతడు వివరించాడు. తల్లి ఐసీయూలో ఉన్నప్పుడు కూడా, తాను, తన టీమ్ సభ్యులు కార్తీక్, దుర్గారావులతో కలిసి అపోలో ఆసుపత్రిలోనే స్కిట్లు ప్రాక్టీస్ చేసేవాళ్ళమని ప్రకాష్ తెలిపాడు. ఏ సమయంలో ఫోన్ వస్తుందోనని భయపడుతూ, పని పట్ల అంకితభావంతో ఉన్నానని అతడు చెప్పాడు. దొంగతనం, మానభంగం, దోపిడీ తప్ప ఒక ఆర్టిస్ట్‌గా ఏ అవకాశమైనా చేస్తానని, సినిమాలు కాకుండా నిజ జీవితంలో అలాంటి పనులు చేయనని ప్రకాష్ స్పష్టం చేశాడు.

ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..