AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు

70-20-10 ఫైనాన్షియల్ రూల్. ఈ రూల్ ప్రకారం.. ఆదాయంలో 70 శాతం రోజువారీ అవసరాలకు, 20 శాతం అత్యవసర నిధి, పాలసీ కోసం, 10 శాతం భవిష్యత్ పెట్టుబడుల కోసం కేటాయించాలి. ఇది ఆర్థిక క్రమశిక్షణను పెంచి, అప్పుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు
Money
Ravi Kiran
|

Updated on: Jan 12, 2026 | 1:56 PM

Share

డబ్బు లావాదేవీలు జాగ్రత్తగా, భవిష్యత్తును కాపాడుకోవడానికి ’70-20-10′ రూల్ చాలా అవసరం. మీ ఆదాయాన్ని కంట్రోల్‌గా ఖర్చుపెట్టేందుకు, రుణ భారాన్ని తగ్గించుకునేందుకు.. దీర్ఘకాలిక సంపదను సృష్టించుకునేందుకు ఇది హెల్ప్‌గా ఉంటుంది.

ఇది చదవండి: ట్రాఫిక్ తప్పించుకోవాలా.? హైదరాబాద్ టూ విజయవాడ ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లండి.!

70 శాతం – రోజువారీ అవసరాలు:

మీరు సంపాదించే ప్రతి నెలా లేదా ప్రతి 100 రూపాయలలో 70 శాతం ప్రస్తుత అవసరాలు, ఖర్చుల కోసం కేటాయించాలి. ఇందులో అద్దె, ఇంటి ఈఎంఐ, కిరాణా సామాన్లు, రవాణా ఖర్చులు, యుటిలిటీ బిల్లులు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇతర రోజువారీ ఖర్చులు ఉంటాయి. చాలా మంది తమ ఆదాయంలో అధిక భాగాన్ని ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులకే ఖర్చు చేసి, ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంటారు. ఈ 70 శాతం పరిధిలోనే మీ అన్ని నిత్యావసర ఖర్చులు ఉండేలా చూసుకోవాలి. ఇది భవిష్యత్ ప్రణాళికలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ప్రస్తుత జీవితాన్ని కూడా ఆస్వాదించడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

20 శాతం – అత్యవసర నిధి, బీమా:

ఆదాయంలో 20 శాతం అత్యవసర పరిస్థితుల కోసం, బీమా ప్రీమియంల కోసం ప్రత్యేకంగా కేటాయించాలి. ఇది లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను కవర్ చేయడమే కాకుండా, ఉద్యోగం కోల్పోవడం, వైద్య అత్యవసరాలు, వాహన మరమ్మతులు, ఇతర అకస్మాత్తుగా వచ్చే ఖర్చులకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ డబ్బును సులభంగా లిక్విడ్ ఫామ్‌లో మారే విధంగా ఉండాలి. బ్యాంకు సేవింగ్స్ ఖాతాలు, పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు, లేదా డెట్ ఫండ్స్(లిక్విడ్ ఫండ్స్) లాంటివి దీనికి అనుకూలం. ఇలాంటి డబ్బు లేకపోతే, అకస్మాత్తుగా ఏదైనా అవసరమైనప్పుడు క్రెడిట్ కార్డులు లేదా వ్యక్తిగత రుణాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది మరింత ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ, ఆసుపత్రి ఖర్చులకే కాకుండా, చికిత్స సమయంలో పని కోల్పోవడం వల్ల వచ్చే నష్టానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

10 శాతం – భవిష్యత్తు పెట్టుబడులు:

మిగిలిన 10 శాతం భవిష్యత్తు లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టాలి. రిటైర్‌మెంట్ ప్రణాళిక, పిల్లల ఉన్నత విద్య, వారి వివాహాలు, ఇల్లు కొనడం లాంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈ భాగాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. ఈ పెట్టుబడులు చిన్నవిగా కనిపించినా, కాలక్రమేణా గణనీయమైన సంపదను సృష్టిస్తాయి. ఇది కేవలం ఆర్థిక భద్రతను మాత్రమే కాకుండా, భవిష్యత్తులో మీ అవసరాలను కూడా తీర్చుతుంది.

70-20-10 రూల్

ఈ రూల్ పాటించడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ కలుగుతుంది. ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూనే, భవిష్యత్తుకు భద్రత కల్పించే సమతుల్య విధానం ఇది. ముఖ్యంగా యువత తమ కోరికలను, గాడ్జెట్‌ల లాంటి వాటిని 70 శాతం పరిధిలోనే తీర్చుకుంటూ, మిగిలిన 30 శాతాన్ని భవిష్యత్తు కోసం జాగ్రత్త చేసుకోవాలి. 70-20-10 రూల్‌ను అనుసరించడం ద్వారా ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా హ్యాపీగా భవిష్యత్తులో లైఫ్ డీల్ చేయొచ్చు.

ఇది చదవండి: బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో నటించింది.. కానీ చిరంజీవితో మాత్రం.! కారణం చెప్పేసిన టాలీవుడ్ హీరోయిన్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై