బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో నటించింది.. కానీ చిరంజీవితో మాత్రం.! కారణం చెప్పేసిన టాలీవుడ్ హీరోయిన్
ప్రముఖ టాలీవుడ్ నటి ఇంద్రజ తన సినీ ప్రస్థానం, తొలిరోజులు, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసింది. చిరంజీవితో సినిమా చేయకపోవడం వెనుక కారణం చెప్పింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన శైలి నటన, అందంతో ప్రత్యేక గుర్తింపు సాధించింది నటి ఇంద్రజ. తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకుంది. తమిళనాడులో పుట్టి పెరిగిన ఇంద్రజ అసలు పేరు రాజాతీ. తన మొదటి చిత్రం ‘జంతర్ మంతర్’లో ఆమె పాత్ర పేరు ఇంద్రజ కావడంతో.. అలా తాను ఫేమస్ అయ్యానని తెలిపింది. పాన్ కార్డ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లాంటి కొన్ని చోట్ల ఇంద్రజ పేరు ఉండగా, పాస్‌పోర్ట్‌లో రెండు పేర్లు ఉన్నాయని తెలిపింది.
ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’
పద్నాలుగు ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇంద్రజకు ఓ మేకప్ మ్యాన్ ద్వారా ఆఫర్ వచ్చింది. ‘జంతర్ మంతర్’ చిత్రీకరణ సమయంలోనే దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి ఆమెను కలిసి యమలీలలో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నాగార్జునతో హలో బ్రదర్ చిత్రంలో ఒక పాటలో నటించడం తన మొదటి ఫీచర్ ఫిల్మ్ సాంగ్ అని తెలిపింది. సినిమాలను ఎంచుకోవడంలో తనకు పెద్దగా అవగాహన లేదని, కథ, పాత్ర నచ్చితేనే సినిమాలు చేసేదాన్నని ఇంద్రజ. పెద్ద బ్యానర్లు, స్టార్ హీరోల గురించి ఎక్కువగా ఆలోచించలేదని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేదాన్నని తెలిపింది.
దివంగత నటి సౌందర్య గురించి మాట్లాడుతూ.. ఆమె పెద్దగా మాట్లాడే వ్యక్తి కాదని.. కానీ ఫ్రెండ్లీగా ఉండేవారని చెప్పింది. సౌందర్య మరణ వార్తను నమ్మడానికి చాలా సమయం పట్టిందని, అది చాలా షాకింగ్ అని గుర్తు చేసుకుంది. బాలకృష్ణ, కృష్ణ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించినా, చిరంజీవితో మాత్రం సినిమా చేయలేకపోయానని తెలిపింది. వెంకటేష్, నాగార్జునతో ప్రత్యేక పాత్రలు, పాటలు చేశానని తెలిపింది. ఆ సమయంలో చిరంజీవితో నటించే అవకాశం దక్కలేదని తెలిపింది.
ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




