AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : ఈ విషయం రివీల్ చేయడం సంతోషంగా ఉంది.. మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్ గ్లింప్స్ సైతం సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేష్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

Mahesh Babu : ఈ విషయం రివీల్ చేయడం సంతోషంగా ఉంది.. మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Jan 10, 2026 | 1:49 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ వారణాసి. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇంతకీ విషయమేంటంటే.. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా జయకృష్ణ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మహేష్ బాబు.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

గ్రామీణ నేపథ్యంలో రాబోతున్నా ఈ సినిమాకు శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి చిత్రాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. అశ్విని దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జయకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు మహేష్. ఈ పోస్టర్‌లో జయ కృష్ణ బైక్ నడుపుతూ శత్రువులపై తుపాకీ గురిపెట్టి యాక్షన్ సీక్వెన్స్‌లో ఉన్నట్లు కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

“#శ్రీనివాస మంగళపురం ఫస్ట్ లుక్ ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. #జయకృష్ణఘట్టమనేని అరంగేట్రం సందర్భంగా నీకు శుభాకాంక్షలు. బలమైన బృందం, ఆసక్తికరమైన ప్రారంభం… అందుకే మొత్తం బృందానికి శుభాకాంక్షలు.” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా..ఈ చిత్రం 2026లో విడుదల అవుతుంది.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..