మిక్స్‌డ్ టాక్ రావటం కామనే.. ప్రభాస్ స్టామినా అప్పుడు తెలుస్తుంది..! రాజా సాబ్ టాక్ పై స్పందించిన మారుతి..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా జనవరి 9న గ్రాండ్ గా విడుదలైంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సరికొత్త హరర్ కామెడీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంటుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. హారర్ ఫాంటసిగా తెరకెక్కిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోవడంలో కాస్త తడబడిందని అభిమానులు అంటున్నారు. ప్రభాస్ లుక్స్, స్టోరీ ఆకట్టుకున్నప్పటికీ సినిమా ఎంగేజింగ్ గా లేదు అని కొందరు అంటున్నారు. అలాగే ప్రభాస్ ఒక్కడే వన్ మ్యాన్ షో చేశాడని మరికొందరు.. మారుతి చెప్పినంత లేదు అని ఇంకొందరు అంటున్నారు.
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్
కాగా రాజా సాబ్ కు వస్తున్న టాక్ పై దర్శకుడు మారుతి స్పందించాడు. పదిరోజుల తర్వాత ప్రభాస్ సత్తా ఏంటో తెలుస్తుందని మారుతి అంటున్నారు. ప్రీమియర్ టైమ్ లో జరిగిన గందరగోళం కారణంగా ఎవరూ సినిమాను ఎంజాయ్ చేయలేకపోయారని మారుతి చెప్పుకొచ్చారు. ఇలాంటి సినిమాలకు ముందు మిక్స్‌డ్ టాక్ రావటం కామనే.. పది రోజులు తరువాత ప్రభాస్ స్టామినా ఏంటో తెలుస్తుందని అన్నారు మారుతి.
13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..
టెక్నికల్ ఇష్యూ కారణంగా ది రాజాసాబ్‌లో ప్రభాస్ సెకండ్ లుక్‌కు సంబంధించి సీన్స్ రిలీజ్ రోజు యాడ్ చేయలేదు. ఈ రోజు( శనివారం) ఈవినింగ్ షో నుంచి ఆ సీన్స్ కూడా యాడ్ చేస్తున్నాం.. రీ ఎడిట్ చేసిన వర్షన్ థియేటర్లలో ప్రదర్శించబోతున్నాం.. సోమవారం నుంచి నార్మల్ టికెట్ రేట్స్‌కే సినిమాను ప్రదర్శిస్తాం అని మారుతి అన్నారు. కాగా రాజా సాబ్ సినిమా నిరాశపరిచిందని ప్రభాస్ అభిమానులు ఆందోళన చేస్తున్నారు. కొందరు అభిమానులు మారుతిని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. మరి కొత్త సీన్స్ యాడ్ చేసిన తర్వాత సినిమా రిజల్ట్ మారుతుందేమో చూడాలి.
వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
