AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamitha Baiju: మమితమ్మ దెబ్బకు.. జన నాయగన్ పై ట్రోల్స్

Mamitha Baiju: మమితమ్మ దెబ్బకు.. జన నాయగన్ పై ట్రోల్స్

Phani CH
|

Updated on: Jan 10, 2026 | 2:30 PM

Share

జననాయగన్ చిత్రంలో విజయ్ కూతురిగా నటించిన మమితా బైజు నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతోంది. మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్‌లో 'ఎల్ల పుగళుమ్' పాటను ఆమె పాడిన తీరు విజయ్ అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. దీనితో సోషల్ మీడియాలో మమితాపై ట్రోలింగ్ తీవ్రమైంది. ప్రేములు, డ్యూడ్ తర్వాత ఈ వివాదం ఆమెకు చర్చనీయాంశంగా మారింది.

సెన్సార్ గొడవలు.. మూవీ రిలీజ్‌ వాయిదాను పక్కకు పెడితే.. జననాయగన్ మూవీలో విజయ్‌ కూతురిగా యాక్ట్ చేసిన మమితా బైజు నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతోంది. మీమర్స్‌కు.. ట్రోలర్స్‌కు మంచి ఫీడ్‌లా మారింది. ‘ప్రేములు’ సినిమాతో ఓవర్ నైట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది మమితా. ఆ తర్వాత డ్యూడ్ సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ క్రమంలోనే ఆమెకు విజయ్ సినిమాలో ఆఫర్ వచ్చింది. ‘జన నాయగన్’ సినిమాలో విజయ్ కూతురి పాత్రలో నటించిందీ మలయాళ బ్యూటీ. అయితే మలేషియాలో జరిగిన జన నాయగన్ మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్లో ఈమె పాడిన పాట నెట్టింట ట్రోల్ టాపిక్‌గా మారింది. దళపతి విజయ్ నటించిన ‘అళగియ తమిళ మగన్’ సినిమా 2007లో విడుదలైంది. ఈ సినిమాలోని ‘ఎల్ల పుగలుమ్’ పాట సూపర్ హిట్ గా నిలిచింది. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. అయితే జననాయగన్ ఈవెంట్ లో మమిత ఈ పాటను ఇష్టమొచ్చినట్లు పాడింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

The Raja Saab Review: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదే! రాజాసాబ్

బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌

ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి

ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

మనుషులు ఎందుకు దండగా.. ఏఐ ఉండగా..