AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment: 5 స్టాక్స్‌తో రూ. 4 కోట్లు..! ఉద్యోగంతో పన్లేదిక.. దెబ్బకు తలరాతే మారుతుంది..

స్టాక్ మార్కెట్‌లో ఎక్కువగా నష్టాలే వస్తాయి. అస్సలు దాని జోలికి వెళ్లకపోవడమే మంచిదని అంటుంటారు. అయితే 90 శాతం మంది నష్టపోవడానికి ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్‌పై అవగాహన లేకపోవడం, మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను గుర్తించడం, స్టాప్ లాస్ మరవడం లాంటివి ప్రధాన కారణాలు..

Investment: 5 స్టాక్స్‌తో రూ. 4 కోట్లు..! ఉద్యోగంతో పన్లేదిక.. దెబ్బకు తలరాతే మారుతుంది..
Stock Market
Ravi Kiran
|

Updated on: Jan 08, 2026 | 12:45 PM

Share

స్టాక్ మార్కెట్ అంటేనే చాలామందికి డబ్బు పోతుందనే భయం ఉంటుంది. అయితే లక్ష రూపాయలతో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెట్టి.. సరైన అవగాహనతో లక్షలు, కోట్లు సంపాదించవచ్చునని బిజినెస్ నిపుణులు అంటున్నారు. స్టాక్ మార్కెట్‌లో 90 శాతం మంది డబ్బు కోల్పోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. మార్కెట్‌ను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, సరైన జ్ఞానం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలని బిజినెస్ నిపుణుడు గణేష్ కుమార్ అట్లూరి అన్నాడు. స్టాక్ మార్కెట్ అంటే వ్యాపారంపై వ్యాపారం చేయడమని, కంపెనీల వ్యాపారాన్ని మనం అర్థం చేసుకోవాలని సూచించాడు. చాలామంది పెట్టుబడిదారులు దీర్ఘకాలిక ఆలోచనతో వచ్చినా, తక్కువ సమయంలోనే రోజువారీ ట్రేడింగ్‌కు మారి భావోద్వేగాలకు లోనవుతారని వివరించాడు.

ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..

స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు చాలా ఎక్కువగా ఉంటాయని.. మీరు ఏ పొలిటికల్ లీడర్ లేదా పలువురు సెలబ్రిటీల పోర్ట్‌ఫోలియోలు చూసినా.. అలాగే ఏస్ ఇన్వెస్టర్లను గమనించినా.. వారంతా ఇప్పుడు ధనవంతులుగా మారారు. 20-30 సంవత్సరాల క్రితం కొన్న స్టాక్స్‌ను అట్టిపెట్టుకోవడం ద్వారా ఈ సంపదను సంపాదించారని చెప్పుకొచ్చాడు. HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్, TCS, టైటాన్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, విప్రో లాంటి స్టాక్స్ కూడా ఒకప్పుడు తక్కువ ధరలో ఉండి, కాలక్రమేణా భారీగా పెరిగాయని చెప్పాడు. స్టాక్ కొనే ముందు, ఆ కంపెనీ, అది పనిచేసే రంగం వృద్ధి సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలని సూచించాడు. బ్యాంకింగ్ రంగం వంటి పెద్ద సెక్టార్లలో వృద్ధికి ఎక్కువ అవకాశం ఉంటుందని అన్నాడు. కోవిడ్ సమయంలో తన కుమార్తె డీమ్యాట్ ఖాతాలోని రూ. 2.75 లక్షల విలువైన స్టాక్స్‌ను(డిక్సన్ టెక్నాలజీస్, లారస్ ల్యాబ్స్ లాంటివి) అమ్మేయడంతో ఇప్పుడు రూ. 75 లక్షల విలువైన పోర్ట్‌ఫోలియోను కోల్పోయానని అతడు తెలిపాడు. మంచి స్టాక్స్‌ను కొన్నప్పుడు పానిక్ అవ్వకూడదనేది కచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠం అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’

గమనిక: షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. నష్టాలకు టీవీ9 బాధ్యత వహించదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి