Reliance Jio: అంబానీయా మజాకా.! రూ. 91కే 28 రోజుల గోల్డెన్ ఆఫర్.. కేవలం వారికి మాత్రమే..
ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో రిలయన్స్ జియో తమ కస్టమర్లను ఆకర్షిస్తూ వస్తోంది. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 91కే లభించే ఈ రీచార్జ్ ప్లాన్ సంగతి ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండేలా ఓ కొత్త ఆఫర్ సరికొత్తగా వచ్చేసింది. రూ. 100 లోపే 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌ను మీరు చూస్తే కచ్చితంగా భలేగా ఉందంటారు. కేవలం రూ. 91 రీఛార్జ్‌తో దాదాపు నెల పాటు ఈ రీచార్జ్ ప్లాన్ ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌తో జియో కస్టమర్లకు 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ లభిస్తుంది.
ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’
డేటా విషయానికొస్తే.. ఈ ప్లాన్‌లో మొత్తం 3 GB డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇందులో రోజుకు 100 MB చొప్పున 2.8 GB డేటాతో పాటు అదనంగా మరో 200 MB డేటా లభిస్తుంది. అలాగే, వ్యాలిడిటీ ఉన్నంతకాలం 50 SMSలు మనం వినియోగించుకోవచ్చు. ఒకవేళ రోజువారీ డేటా పరిమితిని వాడేసినా, ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోకుండా 64 kbps వేగంతో కొనసాగుతుంది. అయితే, ఈ రూ. 91 ప్లాన్ సాధారణ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు వర్తించదని.. ఈ ప్లాన్‌ను ప్రత్యేకంగా జియోఫోన్ వినియోగదారుల కోసం మాత్రమే రూపొందించిందని సంస్థ తెలిపింది. సామాన్య ప్రజలకు తక్కువ ధరకు టెలికాం సేవలను అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. స్మార్ట్‌ఫోన్ వాడే రెగ్యులర్ యూజర్ల కోసం 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న అత్యంత చౌకైన ప్లాన్ ధర రూ. 189గా ఉంది. ఇందులో 2 GB డేటా, అపరిమిత కాలింగ్, 300 SMSల సౌకర్యం ఉంది.
ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




