Credit Card: క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు ఇవి కనిపిస్తున్నాయా..? వెంటనే ఈ పని చేయకపోతే మీ డబ్బులు హాంఫట్
క్రెడిట్ కార్డ్ స్కామ్స్ ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. క్రెడిట్ కార్డ్స్ వాడకం పెరగడంతో మోసాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. సైబర్ నేరగాళ్లు ఏదోక పద్దతిలో వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. అందుకే క్రెడిట్ కార్డ్ వాడేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇందులో చూద్దాం.

Credit Card Usage: ఆర్ధిక పరిస్థితుల క్రమంలో ప్రజలు క్రెడిట్ కార్డులు వాడటం విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఉద్యోగులు, వ్యాపారుల వద్ద మాత్రమే ఇవి కనిపించేవి. కానీ ఇప్పుడు ప్రతీఒక్కరి చేతుల్లో క్రెడిట్ కార్డు కనిపిస్తుంది. డబ్బులు చేతిలో లేనప్పుడు అత్యవసర సమయాల్లో ఉపయోపడుతుందనే ఉద్దేశంతో కొంతమంది వాడుతుంటే.. మరికొంతమంది ఆఫర్లు, డిస్కౌంట్స్ పొందేందుకు ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిన క్రమంలో వీటిపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. క్రెడిట్ కార్డు మోసాలకు పాల్పడుతున్నారు. ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు తెలుసుకుని ఫ్రాడ్స్‌కు పాల్పడుతున్నారు. ఫిషింగ్ స్కాం, కార్డ్ స్విమ్మింగ్, హ్యాకింగ్, కీస్ట్రోక్ క్యాప్చరింగ్ వంటి మోసాలు క్రెడిట్ కార్డుల్లో జరుగుతున్నాయి. వీరి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఫిషింగ్, కార్డ్ స్కిమ్మింగ్ స్కాం
ఫిషింగ్ స్కాం అంటే.. క్రెడిట్ కార్డు వినియోగదారులకు మెయిల్స్, టెక్ట్స్, వాట్సప్ మెస్సేజ్‌ల ద్వారా నకిలీ లింక్‌లు పంపుతారు. ఈ లింక్‌లపై క్లిక్ చేసే మీ వ్యక్తిగత సమాచారం అడుగుతుంది. మీరు తెలిసి తెలియక ఆ వివరాలు ఇస్తే సైబర్ నేరగాళ్లు మీ క్రెడిట్ కార్డు యాక్సెస్ చేయగలుగుతారు. అందుకే మీకు వచ్చే అనుమానిత లింక్‌లపై క్లిక్ చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇక కార్డ్ స్కిమ్మింగ్ మోసం అంటే.. ఏటీఎంలు, కార్డు స్క్రైపింగ్ మెషిన్ల దగ్గర ఎలక్ట్రానిక్ డివైస్‌లను ఏర్పాటు చేసి క్రెడిట్ కార్డు వివరాలను తెలుసుకుంటారు. మీ వివరాలతో నకిలీ క్రెడిట్ కార్డును సృష్టించి డబ్బులు విత్ డ్రా చేస్తారు. అందుకే ఏటీఎంలు, స్క్రైపింగ్ మెషిన్ల దగ్గర ఏవైనా అనుమానిత డివైస్‌లు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి.
కీస్ట్రోక్ క్యాప్చరింగ్ మోసం
ఇక కీస్ట్రోక్ లాగింగ్ విధానం ద్వారా ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉపయోగించి నకిలీ లింక్‌లు మీ ఫోన్‌కు పంపుతారు. మీరు దాన్ని క్లిక్ చేస్తే ఇక అంతే. ఫోన్‌లో మీరు ప్రెస్ చేసే ప్రతీ కీ సైబర్ నేరగాళ్లకు తెలిసిపోతుంది. దీని ద్వారా మీ క్రెడిట్ కార్డ్ వివరాలు తెలుసుకుని మోసానికి పాల్పడారు. దీంతో మీరు పాస్ వర్డ్స్, ఓటీపీలు ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇక నకిలీ లింకుల ద్వారా మీ ఫోన్‌ను హ్యాక్ చేసి క్రెడిట్ కార్డ్ వివరాలు తెలుసుకుంటారు. దీంతో మీ ఫోన్‌కు వచ్చే తెలియని లింకులను మీరు అసలు క్లిక్ చేయకపోవడం మంచిది. ఈ జాగ్రత్తలు పాటిస్తే క్రెడిట్ కార్డ్ మోసాలను నివారించవచ్చని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
