Cricket: ఇదేం బాదుడురా అయ్యా.! 22 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ.. కోహ్లీ కంటే తోపు ఈ ప్లేయర్.. ఎవరంటే.?
క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ 1931లో ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. కేవలం మూడు ఓవర్లలోనే 100 పరుగులు సాధించి అద్భుత రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలోని బ్లూ మౌంటెన్ సిటీలో జరిగింది ఈ మ్యాచ్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

క్రికెట్‌కే గాడ్ ఫాదర్ ఈ ప్లేయర్.. రన్ మిషన్ కోహ్లీ కంటే తోపు ఈ పోటుగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనే ఓ అరుదైన రికార్డు తన పేరిట నమోదు చేశాడు. అతడెవరో కాదు.. డాన్ బ్రాడ్‌మాన్. క్రికెట్‌లో 99 యావరేజ్ కలిగిన ఏకైక బ్యాటర్ డాన్ బ్రాడ్‌మాన్. అయితే, ఈ ఆస్ట్రేలియా దిగ్గజం ఒకసారి కేవలం మూడు ఓవర్లలోనే సెంచరీ కొట్టి అద్భుతం సృష్టించాడు. 1931 నవంబర్ 2న బ్లూ మౌంటెన్ సిటీలో కొత్త పిచ్ ఓపెనింగ్ వేడుకలో భాగంగా బ్లాక్ హీత్ 11, లిత్గో జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్లాక్ హీత్ టీం తరఫున ఆడిన బ్రాడ్‌మాన్ కేవలం 18 నిమిషాల వ్యవధిలో 100 పరుగులు పూర్తి చేశాడు.
ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’
ఆ సమయంలో బిల్ బ్లాక్ అనే బౌలర్, బ్రాడ్‌మాన్ మధ్య ఒక చిన్న పోటీ ఉండేది. బ్రాడ్‌మాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లిత్గో వికెట్ కీపర్, బ్లాక్‌ను ఉద్దేశించి, ‘మన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో నిన్ను అవుట్ చేసిన బౌలర్ వచ్చాడు. గుర్తున్నాడా.? అతని బౌలింగ్ ఆడు చూద్దాం” అని టీజ్ చేశాడు. దీంతో రెచ్చిపోయిన బ్రాడ్‌మాన్.. బ్లాక్ వేసిన ఆ ఓవర్‌లో 33 పరుగులు రాబట్టాడు. తర్వాత హ్యారీ బేకర్ వేసిన ఓవర్‌లో 40 పరుగులు, ఆఖరిగా బ్లాక్ వేసిన మరో ఓవర్‌లో 27 పరుగులు చేసి మూడు ఓవర్లలోనే 100 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఈ మూడు ఓవర్లలో బ్రాడ్‌మాన్ 10 సిక్సర్లు, 9 ఫోర్లు కొట్టాడు. అప్పట్లో ఓవర్‌కు ఎనిమిది బంతులు ఉండేవి. కాబట్టి ఈ మూడు ఓవర్లలో 22 బంతులు ఎదుర్కొన్న బ్రాడ్‌మాన్ కేవలం 22 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు. ఈ రికార్డు క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ చెరగని ఓ మైలురాయిగా ఉంది.
ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..




