AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: పిచ్చి ఆకు అనుకునేరు.. రెండే రెండు కూరలో ఒక్కసారి వేస్తే ఇక వదలరు..!

ఇంట్లో వండిన కూరలకు అద్భుతమైన రుచిని అందించేందుకు ఈ ఆకులు పనికొస్తాయి. పిచ్చి ఆకులనుకునేరు.. వీటిల్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క లాంటి అనేక సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. వీటిని సులభంగా ఇంట్లో పెంచుకోవచ్చు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి..!

Health: పిచ్చి ఆకు అనుకునేరు.. రెండే రెండు కూరలో ఒక్కసారి వేస్తే ఇక వదలరు..!
Allspice Leaves
Ravi Kiran
|

Updated on: Jan 08, 2026 | 12:19 PM

Share

ఇంట్లో రోజూ వండిన కూరలు ఎప్పుడూ ఒకేలా ఉన్నాయా.? రుచిలో కొత్తదనం లేదా.? ఎలాంటి మసాలాలు అవసరం లేదు. కూరల్లో కొత్త రుచిని తీసుకొచ్చేందుకు ఈ ఆకులు ఉంటే చాలు.. సరికొత్త రుచిని తీసుకొస్తాయి. ఇంట్లో వండిన వంటకాల్లో ఒక ప్రత్యేకమైన రుచిని, కొత్తదనాన్ని తీసుకొస్తాయి. వాటినే ఆల్ స్పైసెస్ ఆకులు అని అంటారు. సాధారణంగా కూరలు వండేటప్పుడు పుదీనా, కరివేపాకు, బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు లాంటి అనేక సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తాం. అయినప్పటికీ కొన్నిసార్లు కూర రుచి ఆశించిన స్థాయిలో ఉండదు. అలాంటప్పుడు వంటకు ఒక ప్రత్యేకమైన రుచిని అందించడానికి ఈ ఆల్ స్పైసెస్ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. కేవలం రెండు ఆకులు వేస్తే చాలు, రుచిలో గొప్ప మార్పు వస్తుంది.

ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’

ఈ ఆల్ స్పైసెస్ చెట్టు ఆకుల్లో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఒక్కో ఆకులో లవంగం, యాలకులు, బే ఆకు, దాల్చిన చెక్క లాంటి అనేక సుగంధ ద్రవ్యాలు కలిసి ఉంటాయి. అవి ప్రత్యేక రుచిని అందిస్తాయి. కూరలు, పప్పులు, కాయధాన్యాలు లేదా మరే ఇతర వంటకమైనా, ఈ ఆకులు వేసిన వెంటనే వాటి రుచి రెట్టింపు అవుతుంది. వంట చేసేటప్పుడు బే ఆకుల స్థానంలో రెండు నుంచి నాలుగు ఆల్ స్పైసెస్ ఆకులు వేస్తే సరిపోతుంది. దీని వల్ల అదనంగా ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరమే ఉండదు. ఈ ఆకులు వంటకు ప్రత్యేకమైన సువాసనను అందించి, రుచిని మరింతగా పెంచుతాయి. ఈ ఆల్ స్పైసెస్ ట్రీని ఇంట్లోనే చాలా సులభంగా పెంచుకోవచ్చు. ఏదైనా నర్సరీలో ఈ మొక్క లభిస్తుంది. ఇంటి ముందు పెంచుకునే తోటలో లేదా బాల్కనీలో కూడా కుండల్లో ఈ మొక్కలను పెంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
జస్ట్.. 5 నిమిషాల ఛార్జ్‌తో 800 కిలోమీటర్ల మైలేజ్..
జస్ట్.. 5 నిమిషాల ఛార్జ్‌తో 800 కిలోమీటర్ల మైలేజ్..
బిలియనీర్ ఎలాన్ మస్క్ ఇంటిని చూస్తారా..? ప్రపంచ కుబేరుడి ఇల్లు
బిలియనీర్ ఎలాన్ మస్క్ ఇంటిని చూస్తారా..? ప్రపంచ కుబేరుడి ఇల్లు
ఆ సినిమా ఫ్లాప్‌ అవుతుందని నాకు ముందే తెలుసు: రాశీఖన్నా
ఆ సినిమా ఫ్లాప్‌ అవుతుందని నాకు ముందే తెలుసు: రాశీఖన్నా
హైదరాబాద్ ప్రజలకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్
హైదరాబాద్ ప్రజలకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్
ద్రవిడ్, బిన్నీ, మిథాలీలకు బీసీసీఐ లైఫ్‌టైమ్ అవార్డులు
ద్రవిడ్, బిన్నీ, మిథాలీలకు బీసీసీఐ లైఫ్‌టైమ్ అవార్డులు
ఈ నక్షత్రాల్లో పుట్టినవారు భాగ్యవంతులయ్యే ఛాన్స్..!
ఈ నక్షత్రాల్లో పుట్టినవారు భాగ్యవంతులయ్యే ఛాన్స్..!
వేసవిలో కారు ఆగకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే
వేసవిలో కారు ఆగకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే
ఉగాది గిఫ్ట్‌ అంటే ఇది కదా.. సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్
ఉగాది గిఫ్ట్‌ అంటే ఇది కదా.. సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్
మూడేళ్ల తర్వాత ఇంటికి వచ్చి చూస్తే షాక్.. అపార్ట్‌మెంట్‌ ఆక్రమణ
మూడేళ్ల తర్వాత ఇంటికి వచ్చి చూస్తే షాక్.. అపార్ట్‌మెంట్‌ ఆక్రమణ
శని గ్రహ ప్రభావంతో చక్రం తిప్పబోయే రాశులు ఇవే.. మీ రాశి ఉందా..?
శని గ్రహ ప్రభావంతో చక్రం తిప్పబోయే రాశులు ఇవే.. మీ రాశి ఉందా..?