Actor Madhunandan: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’
టాలీవుడ్ నటుడు మధునందన్ 'శంబాల' చిత్రంలో తన పాత్ర గురించి, తన కాలేజీ రోజుల గురించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఒకేసారి రెండు లేదా మూడు సినిమాలకు డేట్స్ ఇవ్వడం తనకు ఇష్టం ఉండదని తెలిపాడు. దర్శకుడికి ఇబ్బంది కలగకుండా.. ఆ వివరాలు ఇలా..

టాలీవుడ్ నటుడు మధునందన్ తాజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, సినిమాల ఎంపిక విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే తన కాలేజీ స్నేహితులైన హీరో తరుణ్, మంత్రి నారా లోకేష్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాను ఒకేసారి రెండు లేదా మూడు సినిమాలకు డేట్స్ ఇవ్వనని.. ఒక చిత్రాన్ని ఒప్పుకుంటే ఆ సినిమాకు పూర్తిగా తన సమయాన్ని కేటాయిస్తానని తెలిపాడు. శంబాల చిత్రం విషయానికి వస్తే.. దర్శకుడు ఎలాంటి డేట్ సమస్యలు లేకుండా ప్లాన్ చేసుకోవాలనుకున్నారని.. దీనికి తాను పూర్తి మద్దతు ఇచ్చానని మధునందన్ చెప్పాడు. కొన్నిసార్లు ఈ చిత్రం కోసం రెండున్నర నుంచి మూడు రోజుల పాటు నిరంతరాయంగా 48 గంటల పాటు పని చేశానని.. ఇతర షూటింగ్‌లు ఉన్నప్పటికీ దర్శకుడికి ఎప్పుడూ తెలియనివ్వలేదని వివరించాడు. ఒకసారి కమిట్ అయిన తర్వాత, టీమ్ సభ్యులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడం తన బాధ్యత అని అతడు చెప్పుకొచ్చాడు.
ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’
శంబాల చిత్ర నిర్మాత మహీధర్ తన కాలేజీ స్నేహితుడు అని, అతడితో తనకు స్కూల్ రోజుల నుంచి పరిచయం ఉందని మధునందన్ తెలిపాడు. గతంలో తాను పవర్ ప్లే సినిమాలో పోలీస్ పాత్ర పోషించానని, దానిని చూసి మహీధర్ శంబాల సినిమాకు తన ఫోటోను దర్శకుడికి పంపారని చెప్పాడు. కథ విన్న వెంటనే, సినిమా ఒప్పుకున్నానని మధునందన్ అన్నాడు. అలాగే, తనకు హీరో తరుణ్, నారా లోకేష్, వీరేందర్ గౌడ్‌తో కాలేజీ రోజుల నుంచే పరిచయం ఉందని తెలిపాడు. తరుణ్, నారా లోకేష్, వీరేందర్ గౌడ్ తన కంటే ఒక సంవత్సరం జూనియర్లు అని, తామంతా కలిసి వాలీబాల్ ఆడుతూ, కల్చరల్ కార్యక్రమాల్లో పాల్గొనేవారమని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తామంతా చాలా మంచి గ్రూప్‌గా ఉండేవారమని తెలిపాడు.
తరుణ్ తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హీరో అయ్యాడు. అప్పట్లో ఎంత బిజీ అయిపోయాడంటే, అతడి గురించి అతడే పట్టించుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు. అందుకే అప్పుడు అతడ్ని కలవడానికి ప్రయత్నించలేదు. తనకు సినిమా నేపధ్యం లేకపోవడం వల్ల ఆఫర్ల కోసం తీవ్రంగా ప్రయత్నించానని.. తరుణ్‌ని రెండుసార్లు కలవడానికి ప్రయత్నించినా కుదరలేదని చెప్పాడు. తరుణ్ ఎప్పుడూ ప్రోత్సహించేవాడని, ఇప్పటికీ టచ్‌లోనే ఉంటాడని మధునందన్ పేర్కొన్నాడు.
ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




