Sankranti Rush: ట్రాఫిక్ తప్పించుకోవాలా.? హైదరాబాద్ టూ విజయవాడ ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లండి.!
సంక్రాంతి ప్రయాణికుల రద్దీతో హైదరాబాద్ రోడ్లు కిటకిటలాడుతున్నాయ్. నిన్నటి నుంచే పల్లెలకు క్యూకట్టారు జనం. వేలాది వాహనాలు రోడ్డెక్కడంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై హెవీ రష్ కనిపిస్తోంది. ఫుల్ డిటైల్స్ చూద్దాం. ఈ స్టోరీపై ఓ లుక్కేయండి మరి. అవి ఇలా ఉన్నాయి

రహదారులపై సంక్రాంతి రద్దీ కంటిన్యూ అవుతోంది. సొంతూళ్లకు వెళ్తున్న నగర వాసులతో సిటీ అంతటా వాహనాల రష్ కనిపిస్తోంది. రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర వాహనాలు పెద్దఎత్తున బారులు తీరాయి. ఇవాళ్టి నుంచి సంక్రాంతి సెలవులు ఉండటంతో పల్లెలకు క్యూకట్టారు జనం.. దాంతో, వేలాది వాహనాలు రోడ్డెక్కాయి. సంక్రాంతి ప్రయాణికులతో నగర రహదారులన్నీ నిన్న రాత్రి కిటకిటలాడాయి.
ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’
ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో పెద్దఎత్తున ఊళ్లకు తరలివెళ్లారు జనం. హైదరాబాద్ టూ విజయవాడ జర్నీకి సాధారణంగా నాలుగైదు గంటల పైగానే పడుతుంది. ఇక, సెలవులు, పండగ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాలంటే 10 గంటలకు పైగానే పడుతుంది. సంక్రాంతి వచ్చిందంటే, వాహనాల జాతరే ఉంటుంది. అందుకే, హైవేపై సంక్రాంతి రద్దీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం యాక్షన్‌లోకి దిగింది. ముఖ్యంగా హైదరాబాద్ మీదుగా గుంటూరు, ఖమ్మం, విజయవాడ వెళ్లే వాహనాలు, ట్రాఫిక్‌జామ్‌లో ఇరుక్కోకుండా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ టు విజయవాడ హైవేపై రద్దీ ఎక్కువగా ఉండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కార్లు బంపర్ టు బంపర్ అన్నట్టుగా ముందుకెళ్తున్నాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా చౌటుప్పల్ దగ్గర నారాయణపురం రోడ్డును మూసివేశారు.
హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు.. హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగుతుందని చెబుతున్నారు. అలాగే, ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు.. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకుంటే.. ట్రాఫిక్ కష్టాలను తప్పించుకోవచ్చు. భువనగిరి వైపు వెళ్లేందుకు ORR పైనుంచి ఘట్‌కేసర్ దగ్గర ఎగ్జిట్ తీసుకుని వరంగల్ హైవేలోకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా భువనగిరి చేరుకోవచ్చు. చౌటుప్పల్ దగ్గర ట్రాఫిక్ తిప్పల్ని తప్పించుకోవాలంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడమే మంచిది అంటున్నారు పోలీసులు.
ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




