Telangana: కత్తులతో పొడిచి, గొంతుకోసి మహిళ దారుణ హత్య.. కారణం ఏంటో తెలుస్తే!
ఖమ్మం నగరం బ్రాహ్మణ బజార్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రమీల అనే మహిళను కత్తులతో గొంతుకోసి అతి దారుణంగా హత్య చేశారు. అయితే శ్రవణ్ అనే వ్యక్తే ఆమెను తరచూ వేధిస్తుండేవాడని.. అతనే ప్రమీలను హత్య చేసి ఉంటాడనే కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రమీల అనే వివాహిత మహిళను కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేసిన గటన ఖమ్మనం నగరంలోని బ్రాహ్మణ బజార్ లో వెలుగు చూసింది. మోడెం ప్రమీల అనే వివాహిత కస్బాబజార్ సమీపంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తుంది. అయితే ఇటీవల ఆమె పని ముగించుకుని రూమ్‌కి వెళ్లే క్రమంలో జీవీ మాల్ వద్ద ఆమెపై దాడి చేసిన వ్యక్తులు కత్తులతో అతి కిరాతకంగా పొడిచి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన బి. నరసింహా రావు అనే RMP డాక్టర్, ప్రమీల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2015లో వీరు విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. అయితే వీరు విడిపోవడానికి ముందు పాల్వంచలోని శ్రావణ్ అనే వ్యక్తి ఇంట్లో రెంట్‌కు ఉన్నారు. ఆ సమయంలో వీరితో శ్రావణ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రమీల మధ్య వర్తిగా ఉండి శ్రవణ్‌కు డబ్బులు ఇప్పించింది. అయితే అవి తిరిగివ్వాలని ప్రమీల అడగ్గా.. నువ్వా నాతో ఉంటేనే ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తానని శ్రవణ్ ఆమెను గత కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని.. ఆమె భర్త ఆరోపించాడు. ఈ విషయంపై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు.
అయితే ఆ శ్రవణే తన భార్యను హత్య చేసి ఉంటాని భర్త నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరా దృశ్యాల అధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
