Metro Fare Hike: ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
Metro Fare Hike: మెట్రో రైళ్లలో ప్రయాణించే వారికి ఆ ప్రభుత్వం షాకివ్వబోతోంది. వచ్చే నెలలో మెట్రో ట్రైన్ టికెట్ ఛార్జీలను పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ టికెట్ ఛార్జీలను పెంచినట్లయితే ప్రయాణికులపై మరింత భారం పడే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు..

Bangalore Metro Fare Hike: మీరు మెట్రో ప్రియులా? మీరు రోజూ వాటిలో ప్రయాణిస్తారా? అలా అయితే, ఎక్కువ ఛార్జీ చెల్లించడానికి సిద్ధంగా ఉండండి. ఫిబ్రవరి నుండి మెట్రో రైళ్ల ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది హైదరాబాద్ మెట్రో అనుకుంటే పొరపాటే.. ఇది బెంగళూరులో. ధలను నిర్ణయించే కమిటి ప్రతి సంవత్సరం మెట్రో టిక్కెట్ ధరలలో గరిష్టంగా 5% పెంపును సిఫార్సు చేసినందున, రోజువారీ ప్రయాణం కోసం మెట్రో రైలుపై ఆధారపడే వారిపై ఇది మరింత భారం పడే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 2025లో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) భారీ స్థాయిలో ఛార్జీలను సవరించింది. కొన్ని రూట్లలో 71% ఛార్జీలను పెంచిన సంవత్సరం తర్వాత BMRCL మరో షాక్ ఇస్తుందా అనే ప్రశ్న తలెత్తింది. ప్రస్తుత ఛార్జీలతో బెంగళూరు మెట్రో దేశంలోనే అత్యంత ఖరీదైన మెట్రో వ్యవస్థగా మారింది. ఈలోగా మళ్ళీ ఛార్జీలు పెంచితే ప్రయాణికుల జేబులకు మరింత గండి పడటం ఖాయం.
ఇది కూడా చదవండి: Cauliflower Cleaning: కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్.. ఇలా చేస్తే వెంటనే బయటకు వస్తాయి!
ప్రతి సంవత్సరం, మన మెట్రో రైళ్ల టికెట్ ధరల సవరణపై ప్రయాణికుల నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ప్రజా రవాణా సామాన్య పౌరుడికి భరించలేనిదిగా మారుతోంది. మెట్రో ప్రయాణం చౌకగా ఉండాలని, విలాసవంతమైన సేవ కాదని రోజువారీ ప్రయాణికుల అభిప్రాయం. టికెట్ ధరలు మళ్ళీ పెంచితే అది గాయం మీద కారం పోయడం లాంటిదని మండిపడుతున్నారు. రద్దీగా ఉండే రైళ్ల మధ్య ఛార్జీలు పెరుగుతూనే ఉండ, కొత్త మెట్రో రైలు మార్గాల నిర్మాణం నత్తనడకన సాగుతుండటం ప్రయాణికులను చికాకు పెడుతోంది.
Vande Bharat Sleeper: ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్ ఎంత ఉంటుందో తెలుసా?
మెట్రో సేవ చౌకగా ఉండకపోవచ్చు. కానీ రైళ్లు సామర్థ్యానికి మించి నడుస్తున్నప్పుడు దానిని లగ్జరీ సర్వీస్ అని పిలవడం విడ్డూరంగా ఉందంటున్నారు. ప్రయాణికులు ఇప్పటికే దాదాపు 32 శాతం అదనంగా చెల్లిస్తున్నారు. అన్యాయమైన ఛార్జీలను నిశ్శబ్దంగా అంగీకరించడం వల్ల బిఎంఆర్‌సిఎల్ మళ్ళీ ఛార్జీలు పెంచే ధైర్యం వస్తోంది. బెంగళూరులో ప్రస్తుత పరిస్థితి మెట్రోకు ఎక్కువ చెల్లించడం లేదా గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, రెండు సందర్భాల్లోనూ ప్రజలు మాత్రమే మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రయాణికులు తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




