Tata EV: ఇది కదా మైండ్ బోయింగ్ ఆఫర్ అంటే.. రూ. 8 లక్షల కారు కొంటే.. లైఫ్‌టైం బ్యాటరీ ఫ్రీ..!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రముఖ కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. టాటా కంపెనీ ఆ మేరకు త్వరలోనే ఓ ఆఫర్ తెస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి మీరూ లుక్కేయండి మరి.

దేశంలో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగం గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. పెట్రోల్ కార్లతో పోలిస్తే నెలవారీ పొదుపుతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. EV బ్యాటరీ జీవితకాలం వస్తుందా.? అనే సందేహాలను తీరుస్తూ.. ప్రముఖ కంపెనీలు వివిధ రకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఒక ఎలక్ట్రిక్ కారు ధరలో బ్యాటరీ ధర దాదాపు 60 శాతం ఉంటుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీలు ఎనిమిది నుంచి పది సంవత్సరాలు లేదా రెండు లక్షల కిలోమీటర్ల వరకు పనిచేస్తాయి. ఆ తర్వాత కాలక్రమేణా వాటి పరిధి తగ్గుతుంది.
ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’
లైఫ్ టైమ్ వారంటీ అంటే సాధారణంగా దేశంలో 15 సంవత్సరాలు ఉంటుంది. మొదటి యజమానికి అపరిమిత కిలోమీటర్ల వరకు కవరేజీని అందిస్తుంది. టాటా మోటార్స్ EV, నెక్సాన్ EV మోడళ్లు త్వరలో జీవితకాల బ్యాటరీ వారంటీని అందించనున్నాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ లిమిటెడ్ 2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 22 శాతం వృద్ధి సాధించింది. మూడవ త్రైమాసికంలో(అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు), కంపెనీ మొత్తం 1,71,013 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో 1,39,829 యూనిట్లను విక్రయించింది. గతంతో పోలిస్తే ఇది 22 శాతం వృద్ధి. ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి నేపధ్యంలో కంపెనీలు ఈ మేరకు పలు ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నాయి.
ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




