Union Budget: బడ్జెట్‌లో దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పబోతుందా..? ట్యాక్స్‌లపై కీలక నిర్ణయం..!
ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ఎలాంటి కొత్త పథకాలు ఉంటాయి..? ట్యాక్స్ మినహాయింపులు ఎలా ఉంటాయనే దానిపై అన్నీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ట్యాక్స్ స్లాబులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.

బడ్జెట్ సమావేశాల తేదీలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తొలి దశ బడ్జెట్ సమావేశాలు జనవరి 28వ తేదీన ప్రారంభం కానున్నాయి. మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల నిర్వహణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. జనవరి 28న రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. 29వ తేదీన ఆర్ధిక సర్వే ప్రవేశపెట్టనుండగా.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
అయితే బడ్జెట్ సమవేశాలకు ముహూర్తం ఖారారు కావడంతో ఈ సారి దేశ ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాలు ఏం ఉంటాయనే చర్చ మొదలైంది. బడ్జెట్ అనగానే పన్ను మినహాయింపులు, పన్ను లిమిట్, పన్ను శ్లాబుల గురించి సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత బడ్జెట్‌లలో ఆదాయపు పన్ను పరిమితిని కేంద్రం పెంచుతూ వస్తోంది. గత బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు ఆదాయంలోపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా రీబేట్ ఇచ్చింది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.
పరిమితి రూ.35 లక్షలకు పెంపు..?
ఈ సారి బడ్జెట్‌లో రూ.24 లక్షలపైన ఆదాయంకు పన్ను చెల్లించేవారికి ప్రభుత్వం ఊరట కల్పించనుంది తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న స్లాబుల ప్రకారం రూ.24 లక్షలకు మించి ఆదాయం సంపాదించేవారికి పన్ను రేటు 30 శాతంగా ఉంది. రానున్న బడ్జెట్‌లో దీనిని రూ.35 లక్షలకు పెంచనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం, ఆర్ధిక పరిస్థితుల కారణంగా లిమిట్‌ను పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ లిమిట్‌ను పెంచడం వల్ల మధ్యతరగతి, ఉన్నతి మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. దీని వల్ల ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బులు ఉండటం వల్ల కొనుగోళ్లు పెరుగుతాయని, దీని వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థకు లాభం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక వీరికి పన్ను తగ్గింపు వల్ల రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ వంటి రంగాలు అభివృద్ది చెందుతాయని కేంద్రం అంచనా వేసింది. మిగిలిన డబ్బులును ఈ రంగాల్లో ఖర్చు చేయడం వల్ల వాటికి ఉపయోగం ఉంటుందని చెబుతోంది. ఒకవేళ ఇదే జరిగితే మధ్యతరగతి ప్రజలకు ఊరట వచ్చినట్లే అని చెప్పవచ్చు. ఇక ప్రమానిక తగ్గింపు పరిమితిన కూడాప ెంచే అవకాశముందనే చర్చ జోరుగా పారిశ్రామిక వర్గాల్లో నడు్తోంది,.
