Investment Tips: రూ. 30 వేల జీతంతో రూ. కోటి సంపాదన.. దర్జాగా జీవితాంతం బ్రతికేయొచ్చు.. ఎలాగంటే.?
Investment Tips: 10 ఏళ్లలో రూ. 1 కోటి పోర్ట్‌ఫోలియోను మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా సాధించాలో బిజినెస్ నిపుణులు వివరిస్తున్నారు. స్థిరమైన SIPలు, స్టెప్-అప్ ప్లాన్‌లు లేదా ఏకమొత్తం పెట్టుబడుల ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చునని అంటున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

రోజురోజుకూ ధరలు భారీగా పెరుగుతున్నాయ్. కొనేందుకు అన్నీ కూడా కష్టంగా మారాయి. ముఖ్యంగా సామాన్యులు తమ కలలను నెరవేర్చుకోవాలంటే.. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 10 ఏళ్లలో రూ. 1 కోటి పోర్ట్‌ఫోలియోను ఎలా నిర్మించుకోవాలో బిజినెస్ నిపుణులు సూచనలు ఇస్తున్నారు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చునని అన్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి లమ్‌సమ్(ఏకమొత్తం), మరొకటి SIP – సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ప్రతి నెలా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం.
ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’
నెలవారీ ఆదాయం ఉన్నవారికి, అనేక SIP పద్దతులు ఉన్నాయ్..
1. స్థిరమైన SIP: నెలకు రూ. 36 వేలను డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లో 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. ఇది 15 శాతం వార్షిక రాబడిని ఇస్తే రూ. 1 కోటి పోర్ట్‌ఫోలియోను సృష్టిస్తుంది. నెలకు రూ. 36 వేలు ఆదా చేస్తే కుటుంబానికి సుమారు రూ. 12 లక్షల వార్షిక ఆదాయం అవసరమవుతుంది.
ఇవి కూడా చదవండి2. స్టెప్-అప్ SIP: రూ. 25 వేల SIPతో ప్రారంభించి, ప్రతి సంవత్సరం 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. ఆదాయం పెరుగుతున్న వారికీ ఇది అనువైన పద్ధతి.
3. స్టెప్-అప్ SIP(స్థిర మొత్తం ఆధారంగా): రూ. 20 వేల SIPతో ప్రారంభించి, ప్రతి సంవత్సరం రూ. 5 వేలు పెంచుకుంటూ పోవాలి. ఇది లెక్కించడానికి సులభంగా ఉంటుంది.
మరికొందరైతే.. బోనస్ వచ్చినప్పుడు లేదా వ్యాపారం నుంచి లాభాలు వచ్చినప్పుడు, సంవత్సరానికి రూ. 4 లక్షలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఒకవేళ భారీగా ఏకమొత్తం పెట్టుబడి పెట్టాలనుకుంటే, రూ. 25 లక్షలను ఒకేసారి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, 10 సంవత్సరాలలో అది రూ. 1 కోటికి చేరవచ్చని బిజినెస్ నిపుణులు అన్నారు.
ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు
గమనిక: షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. నష్టాలకు టీవీ9 బాధ్యత వహించదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




