ODI: వన్డేల్లో పరమ జిడ్డుగాడు ఈ ప్లేయర్..! టీమిండియాపైనే స్లో సెంచరీ చేశాడు.. ఎన్ని బంతులంటే.?
టీమిండియాపైనే ఈ రికార్డులన్నే కొడతారేమో.! వన్డేల్లో పరమ జిడ్డు ప్లేయర్.. కానీ.! టీమిండియాపై సెంచరీ చేశాడు.. జట్టుకు విజయాన్ని అందించాడు. మరి అతడెవరో తెలుసా.? ఆ మ్యాచ్ ఎప్పుడు జరిగిందంటే.? తెలియాలంటే ఓ సారి ఈ స్టోరీ చూసేయాల్సిందే.. మరి లేట్ ఎందుకు.?

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత నెమ్మదిగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ బూన్ నిలిచాడు. 1991లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 166 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. లక్ష్యం తక్కువ కావడంతో, నెమ్మదిగా ఆడినా తన జట్టును 49వ ఓవర్‌లో గెలిపించాడు. ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఏబీ డివిలియర్స్ పేరు తరచుగా వినిపిస్తుంది. అయితే అత్యంత నెమ్మదిగా సెంచరీ కొట్టిన బ్యాట్స్‌మెన్ గురించి చాలామందికి తెలియదు. ఈ అరుదైన రికార్డు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ బూన్ పేరిట ఉంది.
ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’
1991వ సంవత్సరంలో భారత్‌తో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌లో డేవిడ్ బూన్ 166 బంతులు ఎదుర్కొని తన సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఇది ఇప్పటివరకు వన్డే క్రికెట్ చరిత్రలో నమోదైన అత్యంత స్లో సెంచరీ. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 176 పరుగుల లక్ష్యం మాత్రమే ఉండటంతో, డేవిడ్ బూన్ చాలా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతడు నెమ్మదిగా సెంచరీ చేసినప్పటికీ, 49వ ఓవర్‌లో తన జట్టును విజయపథంలో నడిపించాడు. ఇప్పటికీ ఇది వన్డే క్రికెట్‌లో ఒక అరుదైన, గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌గా మిగిలిపోయింది.
ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




