IPL: టీ20ల్లో ఆడకుండానే ఐపీఎల్ కెప్టెన్లుగా మారారు.. లిస్టులో ఎవరున్నారో చూస్తే షాకే.!
సాధారణంగా టీ20ల్లో అనుభవం ఉన్న ఆటగాళ్లనే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎంపిక చేస్తాయి. అలాగే వారి అనుభవం దృష్ట్యా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తాయి. అయితే ఇక్కడ ఓ ఐదుగురు ప్లేయర్స్‌ను ఎలాంటి టీ20 అనుభవం లేకుండానే ఎంపికయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఐపీఎల్ చరిత్రలో ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన అనుభవం లేని ఐదుగురు ఆటగాళ్లు తమ జట్లకు నాయకత్వం వహించారు. సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వివిఎస్ లక్ష్మణ్, షేన్ వార్న్, కరుణ్ నాయర్ ఈ జాబితాలో ఉన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది చదవండి: ట్రాఫిక్ తప్పించుకోవాలా.? హైదరాబాద్ టూ విజయవాడ ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లండి.!
వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ లాంటి పెద్ద ఫ్రాంచైజీ లీగ్‌లో ఆడాలని ప్రతీ ప్లేయర్‌కి కోరిక ఉంటుంది. అయితే అంతర్జాతీయ టీ20 అనుభవం లేకుండా.. ఐపీఎల్ చరిత్రలో ఓ ఐదుగురు ప్లేయర్స్ వివిధ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించారు. వారిలో కొందరు టీ20 క్రికెట్ పాపులారిటీ సాధించే టైంకి రిటైర్ అయినవాళ్లు కూడా ఉన్నారు. అలాగే జాతీయ జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయారు.
టీమిండియా దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వివిఎస్ లక్ష్మణ్.. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డెక్కన్ ఛార్జర్స్ జట్లకు కెప్టెన్సీ చేశారు. వీరెవరూ అంతర్జాతీయ స్థాయిలో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అదేవిధంగా, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ కూడా తన దేశం తరఫున ఒక్క టీ20 మ్యాచ్ ఆడకుండానే రాజస్థాన్ రాయల్స్ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అయితే, 2017లో కరుణ్ నాయర్ ఎలాంటి అంతర్జాతీయ టీ20 అనుభవం లేకుండానే ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కెప్టెన్సీ చేయడం విశేషం. ఈ ఐదుగురు ఆటగాళ్లు అంతర్జాతీయ టీ20 అనుభవం లేకపోయినా ఐపీఎల్‌లో తమ జట్లను సమర్థవంతంగా నడిపించారు. వారి నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.
ఇది చదవండి: బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో నటించింది.. కానీ చిరంజీవితో మాత్రం.! కారణం చెప్పేసిన టాలీవుడ్ హీరోయిన్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




