ROKO Entry : బీరువాలో నుంచి బయటకొచ్చిన బాస్‌లు..రోహిత్-విరాట్ సర్ప్రైజ్ ఎంట్రీకి వడోదర షేక్
ROKO Entry : సాధారణంగా స్టేడియంలో ప్లేయర్లను బొకేలు ఇచ్చి లేదా శాలువాలు కప్పి సన్మానించడం చూస్తుంటాం. కానీ వడోదరలో మాత్రం అందుకు భిన్నంగా చాలా క్రియేటివ్‌గా ప్లాన్ చేశారు. మైదానంలో ఒక ప్రత్యేకమైన క్లోసెట్(బీరువా వంటి సెటప్) ఏర్పాటు చేశారు. ఆ క్లోసెట్ తలుపుల మీద రోహిత్, విరాట్ భారీ ఫోటోలు ఉన్నాయి.

ROKO Entry : భారత క్రికెట్ చరిత్రలో జనవరి 11, 2026 ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోతుంది. వడోదరలోని కొత్తగా నిర్మించిన కోటాంబి స్టేడియం తన మొట్టమొదటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని బరోడా క్రికెట్ అసోసియేషన్, టీమిండియా వెటరన్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అద్భుతమైన రీతిలో సన్మానించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ఈ కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా స్టేడియంలో ప్లేయర్లను బొకేలు ఇచ్చి లేదా శాలువాలు కప్పి సన్మానించడం చూస్తుంటాం. కానీ వడోదరలో మాత్రం అందుకు భిన్నంగా చాలా క్రియేటివ్‌గా ప్లాన్ చేశారు. మైదానంలో ఒక ప్రత్యేకమైన క్లోసెట్(బీరువా వంటి సెటప్) ఏర్పాటు చేశారు. ఆ క్లోసెట్ తలుపుల మీద రోహిత్, విరాట్ భారీ ఫోటోలు ఉన్నాయి. సడన్‌గా ఆ తలుపులు తెరుచుకోగానే, లోపలి నుంచి రోహిత్, విరాట్ నవ్వుతూ బయటకు వచ్చారు. ఈ క్లోసెట్ రివీల్ చూసి స్టేడియంలోని అభిమానులు కేరింతలతో హోరెత్తించారు.
Just in! Kohli and Sharma come out of closet pic.twitter.com/ZC0uKlCfxD
— Kapil (@KapilReddy) January 11, 2026
బయటకు వచ్చిన రోహిత్, విరాట్ తమ భారీ చిత్రాలపై ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి ఆ కొత్త స్టేడియానికి శాశ్వత గుర్తింపును అందించారు. భారత క్రికెట్‌కు వారు చేసిన అసమానమైన సేవలకు కృతజ్ఞతగా బరోడా క్రికెట్ అసోసియేషన్ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. సౌతాఫ్రికా గడ్డపై 2-1తో సిరీస్ గెలిచి వచ్చిన ఉత్సాహంలో ఉన్న రో-కో జోడీ, సొంత గడ్డపై మళ్ళీ బరిలోకి దిగడం చూసి అభిమానులు పరవశించిపోయారు. రోహిత్ తనదైన శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, కోహ్లీ నంబర్ 3లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు వడోదరలో వినిపించిన అరుపులు స్టేడియాన్ని షేక్ చేశాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
