Baba Vanga: ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.?
2026లో యుద్ధం, విధ్వంసం జరుగుతాయని జోస్యం చెప్పింది బాబా వంగా. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు, రష్యా-ఉక్రెయిన్ ఘర్షణలు, అమెరికా వాణిజ్య యుద్ధాలు, చమురు రాజకీయాలు లాంటివి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బాబా వంగా జ్యోతిష్యంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంది. గతంలో ఆమె చెప్పిన చాలానే జోస్యాలు నిజమయ్యాయని నెటిజన్లు అంటుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2026లో మూడో ప్రపంచ యుద్ధం జరగబోతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 9/11 దాడులు, కోవిడ్-19 లాంటి పరిణామాలను ముందే ఊహించిన బాబా వంగా.. 2026ను యుద్ధం, విధ్వంసం వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను పరిశీలిస్తే.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదని సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. వెనిజులాపై అమెరికా సైనిక దాడి, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు, రష్యా చమురు నౌకలపై అమెరికా దాడులు, ఇరాన్‌లో అంతర్గత తిరుగుబాటు, తైవాన్‌పై చైనా సైనిక చర్యకు సిద్ధమవుతోందనే వార్తలు, అలాగే గ్రీన్ ల్యాండ్‌ను చేజిక్కించుకుంటా అంటూ ట్రంప్ చేసిన ప్రకటనలపై ఈ భయాందోళనలకు కారణమవుతున్నాయి.
ఇది చదవండి: ట్రాఫిక్ తప్పించుకోవాలా.? హైదరాబాద్ టూ విజయవాడ ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లండి.!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌పై దృష్టి సారించడం, యూరప్ దేశాలపై ఘర్షణలకు సిద్ధపడటం, కొలంబియా, మెక్సికో, క్యూబా లాంటి దేశాలపై చర్యలకు ఉపక్రమించడం వంటివి ఉద్రిక్తతలను పెంచాయి. లాటిన్ అమెరికా నుంచి యూరప్ వరకు విస్తరించిన చమురు రాజకీయాలు, వాణిజ్య యుద్ధాలు ప్రపంచాన్ని యుద్ధం వైపు నడుపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బాబా వంగా జోస్యం ప్రకారం, 2026లో ప్రకృతి వైపరీత్యాలతో పాటు భారీ సైనిక ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు శాంతి వైపు వెళ్తాయా లేదా బాబా వంగా చెప్పినట్టుగా విధ్వంసానికి దారితీస్తాయా అనేది వేచి చూడాలి.
ఇది చదవండి: బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో నటించింది.. కానీ చిరంజీవితో మాత్రం.! కారణం చెప్పేసిన టాలీవుడ్ హీరోయిన్
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




