Cricket: 7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతుల ఓవర్.. ఆ పాక్ ప్లేయర్ ఎవరంటే.?
సాధారణంగా ఓవర్‌కు వచ్చి ఆరు లేదా ఎనిమిది బంతులు(పూర్వం) ఉంటాయి. ఒకవేళ బౌలర్ ఎక్స్ ట్రా బంతులు వేస్తే.. అది కాస్తా పది లేదా పన్నెండు బంతులు అవుతాయి. కానీ ఈ పాకిస్తాన్ బౌలర్ మాత్రం ఏకంగా ఓవర్‌కి 17 బంతులు వేశాడు. మరి అతడెవరో తెలుసా.?

క్రికెట్ చరిత్రలో పాక్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సమీ 2004 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై ఏకంగా 17 బంతులతో ఒకే ఓవర్ వేశాడు. ఇందులో ఏడు వైడ్లు, నాలుగు నో బాల్స్ ఉన్నాయి. ఈ ఓవర్‌లో బంగ్లాదేశ్ జట్టుకు 22 పరుగులు వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది అత్యంత సుదీర్ఘమైన ఓవర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది.
ఇది చదవండి: ట్రాఫిక్ తప్పించుకోవాలా.? హైదరాబాద్ టూ విజయవాడ ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లండి.!
వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ అనగానే సాధారణంగా ఒక ఓవర్‌లో ఆరు బంతులు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. పూర్వం ఇది కాస్తా ఒక ఓవర్‌కు 8 బంతులు ఉండేది. అలాగే అదనపు బంతులు(ఎక్స్‌ట్రాలు) కారణంగా పది లేదా పన్నెండు బంతులు పడొచ్చు. ఒక ఓవర్‌లో ఏకంగా 17 బంతులు వేయడం మీరెప్పుడైనా చూశారా.! పాక్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సమీ 2004 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు.
ఆ మ్యాచ్‌లో మూడో ఓవర్‌ను వేయడానికి వచ్చిన సమీ.. ఏడు వైడ్ బంతులు, నాలుగు నో బాల్స్‌తో కలిపి మొత్తం 17 బంతులను వేశాడు. ఈ ఒక్క ఓవర్‌లోనే బంగ్లాదేశ్ జట్టు 22 పరుగులు రాబట్టింది. ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఒక బౌలర్ వేసిన అత్యంత సుదీర్ఘమైన ఓవర్‌గా నమోదైంది. ఆసక్తికరంగా, ఇదే మ్యాచ్‌లో సమీ తన మొదటి ఓవర్‌ను మెయిడెన్‌గా వేసి ఒక వికెట్‌ను కూడా తీశాడు. పాక్ క్రికెటర్లకే ఇది సాధ్యం అని.. నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇది చదవండి: బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో నటించింది.. కానీ చిరంజీవితో మాత్రం.! కారణం చెప్పేసిన టాలీవుడ్ హీరోయిన్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
