AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాక్సాఫీస్‌ను రప్ఫాడిస్తోన్న ‘మన శంకరవరప్రసాద్ గారు’.. మెగాస్టార్ మూవీకి 4 రోజుల్లో ఎన్నికోట్లు వచ్చాయంటే?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మెగా మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ మూవీ నాలుగు రోజుల కలెక్షన్లకు సంబంధించి అధికారక ప్రకటన విడుదలైంది.

బాక్సాఫీస్‌ను రప్ఫాడిస్తోన్న 'మన శంకరవరప్రసాద్ గారు'.. మెగాస్టార్ మూవీకి 4 రోజుల్లో ఎన్నికోట్లు వచ్చాయంటే?
Mana Shankaravaraprasad Garu
Basha Shek
|

Updated on: Jan 16, 2026 | 12:20 PM

Share

‘మన శంకరవరప్రసాద్ గారు’ అస్సలు తగ్గట్లేదు. రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ ను రప్ఫాడిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’మూవీకి ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడత మెగాభిమానులతో పాటు సామాన్య జనాలు కూడా మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లకు పోటెత్తుతున్నారు. దీంతో ఈ మెగా మూవీకి రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే రూ. 84 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక మూడో రోజే రూ. 150 కోట్ల క్లబ్ లో చేరిపోయిన ఈ మెగా మూవీ ఇప్పుడు రూ. 200 కోట్లకు చేరువలో ఉంది. తాజాగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ నాలుగు రోజుల కలెక్షన్లకు సంబంధించి నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. ఇప్పటివరకు ఈ మూవీ మొత్తం రూ. 190 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని మేకర్స్ పేర్కొన్నారు. అన్ని ఏరియాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేశామని, ప్రేక్షకుల డిమాండ్ కు తగ్గట్టుగా చాలా ఏరియాల్లో అదనపు షోలు వేస్తున్నానమన్నారు. ఇక ఓవర్సీస్ లోన మన శంకరవరప్రసాద్ కు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో 2 మిలియన్ల డాలర్క్ మార్క్ ను అధిగమించినట్లు నిర్మాతలు తెలిపారు. ఇక ఈ నాలుగు రోజుల్లో బుక్ మై షోలో 2 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయినట్లు చిత్ర బృందం పేర్కొంది.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాను నిర్మించారు. చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశాడు. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. భీమ్స్ అందించిన పాటలు హైలెట్ గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

రూ. 200 కోట్లకు చేరువలో మన శంకరవరప్రసాద్ గారు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!
మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!
రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?
రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?
సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు
సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు