AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: హీరోగా 23 సినిమాలు చేస్తే 11 ఫ్లాపులు.. ఇప్పుడు ఆ పని చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు.. ఎవరంటే?

పెద్దింటి కుటుంబం నుంచి వచ్చిన ఇతనికి హీరోగా అవకాశాలు బాగానే వచ్చాయి. తన అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిలకు ఫేవరెట్ గా మారిపోయాడు. కానీ ఇతను హీరోగా చేసిన సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించలేకపోయాయి. దీంతో..

Tollywood: హీరోగా 23 సినిమాలు చేస్తే 11 ఫ్లాపులు.. ఇప్పుడు ఆ పని చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు.. ఎవరంటే?
Neil Nitin Mukesh
Basha Shek
|

Updated on: Jan 15, 2026 | 4:30 PM

Share

ఈ హీరో పెద్దింటి కుటుంబం నుంచి వచ్చాడు. దీంతో మొదట సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అతను నటనా పరంగా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిలకు ఫేవరెట్ గా మారిపోయాడు. కానీ ఇతను హీరోగా చేసిన సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించలేకపోయాయి. కెరీర్ ప్రారంభంలో ఇతను హీరోగా 23 చిత్రాలు చేశాడు. అందులో 11 సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో తన పంథాను మార్చుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ ట్రై చేశాడు. సక్సెస్ అయ్యాడు. ఇప్పుడీ నటునికి దక్షిణాది సినిమాల్లోనూ విలన్ పాత్రలు వస్తున్నాయి. ఇంతకీ అతనెవరనుకుంటున్నారా? బాలీవుడ్ హ్యాండ్సమ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్ గురించి. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ ప్రభాస్ నటించిన సాహో సినిమాలో లో ‘జై’ అంటే ఇట్టే ఠక్కున గుర్తు పడతారు. నీల్ నితిన్ 1982 జనవరి 15న ముంబైలో జన్మించాడు. ఇతని అసలు పేరు నీల్ మాథుర్, కానీ తండ్రి, తాత పేర్లు కలిసి వచ్చేలా నీల్ నితిన్ ముఖేష్ అని పేరు పెట్టుకున్నాడు. ఈ ఈ నటుడి తండ్రి నితిన్ ముఖేష్ ఒక ప్రముఖ గాయకుడు. తాత ముఖేష్ కూడా హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ సింగర్. ఇలా నీల్ కుటుంబం సంగీతంతో ముడిపడి ఉంది. ‘జానీ గద్దర్’ చిత్రంతో మంచి విజయం అందుకున్న నితిన్ ఆ తర్వాత ‘ఆ దోఖ్తర్ జారా’, ‘న్యూయార్క్’, ‘లఫాంగే పరిండే’, ‘ప్లేయర్స్’, ‘3G’ తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు.

ఈ సినిమాల్లో నితిన్ నటనకు మంచి పేరొచ్చినా సినిమాలు మాత్రం కమర్షియల్ గా పెద్దగా విజయాలు సాధించలేకపోయాయి. దీంతో ఈ హీరో కాస్తా విలన్ అవతారమెత్తాడు. ‘వజీర్’లో నితిన్ చేసిన విలన్ రోల్ హైలైట్ గా నిలిచింది. దీనిని కొనసాగిస్తూ ‘గోల్‌మాల్ ఎగైన్’ , ‘సాహో’ చిత్రాలలో కూడా పవర్ ఫుల్ విలన్ గా యాక్ట్ చేశాడీ హ్యాండ్సమ్ యాక్టర్. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన కవచం సినిమాలోనూ విలన్ గా మెప్పించాడీ బాలీవుడ్ హ్యాండ్సమ్ యాక్టర్. అలాగే పలు దక్షిణాది సినిమాల్లోనూ డిఫరెంట్ రోల్స్ తోనూ మెప్పించాడు.

ఇవి కూడా చదవండి

నీల్ నితిన్ ముఖేష్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

నీల్ నితిన్ ముఖేష్ కేవలం నటుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా. సినిమాలతో పాటు, సామాజిక సేవ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. 2009 లో, ఆయన ఒక ఎన్జీఓను ప్రారంభించాడు. దీని ద్వారా పేద మహిళలకు ఆహారం, ఆశ్రయం అందిస్తున్నాడు. నీల్ నితిన్ నికర ఆస్తుల గురించి మాట్లాడుకుంటే.. ఈ నటుడి మొత్తం సంపద దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని సమాచారం. ఇది కాకుండా అతని పేరిట లగ్జరీ భవనాలు, కార్లు, గడియారాలు ఇతర ఖరీదైన వస్తువులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా భారీగా సంపాదిస్తున్నాడు హ్యాండ్సమ్ యాక్టర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

23 సినిమాలు చేస్తే 11 ఫ్లాపులు.. ఇప్పుడేమో ఆ పనితో కోట్లు..
23 సినిమాలు చేస్తే 11 ఫ్లాపులు.. ఇప్పుడేమో ఆ పనితో కోట్లు..
వైభవ్ సూర్యవంశీ పక్కనే దొరికిన మరో వజ్రం..
వైభవ్ సూర్యవంశీ పక్కనే దొరికిన మరో వజ్రం..
సంక్రాంతి స్పెషల్ ఫ్రూట్‌ ఇది..తింటే ఎన్నో భయంకర సమస్యలకు చెక్..!
సంక్రాంతి స్పెషల్ ఫ్రూట్‌ ఇది..తింటే ఎన్నో భయంకర సమస్యలకు చెక్..!
ఒంటరిగా ఉన్నామని ఎందుకు అనిపిస్తుంది? అందుకు మీ అలవాట్లే కారణమా?
ఒంటరిగా ఉన్నామని ఎందుకు అనిపిస్తుంది? అందుకు మీ అలవాట్లే కారణమా?
బ్యాంకు లోన్‌ చెల్లించకపోతే ఏమవుతుంది? బ్యాంకు ఏం చేస్తుంది?
బ్యాంకు లోన్‌ చెల్లించకపోతే ఏమవుతుంది? బ్యాంకు ఏం చేస్తుంది?
అమెరికా సెగతో ఇరాన్ లో అట్టుడికిన ఆందోళనలు! వీడియో
అమెరికా సెగతో ఇరాన్ లో అట్టుడికిన ఆందోళనలు! వీడియో
ఈడీ vs బెంగాల్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
ఈడీ vs బెంగాల్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
ఇంటర్నెట్ లేకుండా కీప్యాడ్ ఫోన్‌తో UPI పేమెంట్స్ చేయడం ఎలా?
ఇంటర్నెట్ లేకుండా కీప్యాడ్ ఫోన్‌తో UPI పేమెంట్స్ చేయడం ఎలా?
తులసి మొక్కతోపాటు ఈ మొక్కలు ఇంట్లో నాటితే,డబ్బు కష్టాలు తీరినట్టే
తులసి మొక్కతోపాటు ఈ మొక్కలు ఇంట్లో నాటితే,డబ్బు కష్టాలు తీరినట్టే
మహేష్ బాబు లుక్స్ సీక్రెట్స్ ఇవే.. అసలు విషయాలు చెప్పిన మంజుల ఘట్
మహేష్ బాబు లుక్స్ సీక్రెట్స్ ఇవే.. అసలు విషయాలు చెప్పిన మంజుల ఘట్